సాహో కలెక్షన్ల సునామీ.. 2 వారాల్లో ఎంత రాబట్టిందో తెలుసా? లేటెస్ట్ రిపోర్ట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి సత్తా చాటుతున్నాడు. గతంలో 'బాహుబలి' సిరీస్‌తో వరల్డ్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించి, బాక్సాఫీస్ షేక్ చేసిన ఈ హీరో.. ఇప్పుడూ అందరిచేత 'సాహో' అనిపించుకుంటున్నాడు. ప్రభాస్ హీరోగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సాహో' కలెక్షన్ల సునామీ స్తుష్టిస్తూ పరుగులు పెడుతోంది. ఇటీవలే 400 కోట్ల క్లబ్‌లో చేరి రికార్డులు తిరగరాస్తున్న ఈ సినిమా తన హవా కొనసాగిస్తూనే ఉంది.

అతి తక్కువ అనుభవం ఉన్న యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన 'సాహో' చిత్రం తొలుత మిశ్రమ స్పందన తెచ్చుకున్నపటికీ ఆ తర్వాత పుంజుకుంది. అన్ని ఏరియాల్లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తూ ఓ రేంజ్ బిజినెస్ చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా 'సాహో' సంచలనంగా మారింది. అయితే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 2 వారాల్లో సాహో మూవీ 424 కోట్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మేరకు కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు.

Prabhas Saaho 2 Weeks Collection Report

తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో 'సాహో' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో సుజిత్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించింది. టైగర్ ష్రాఫ్, మందిరా బేడీ సహా పలు భాషల్లోని భారీ తారాగణం ఈ సినిమాలో పాలు పంచుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X