తెలుగు రాష్ట్రాల్లో జోరుమీదున్న సాహో.. ఏ ఏరియాలో ఎంత రాబట్టిందో తెలుసా..?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన తాజా చిత్రం 'సాహో'. ప్రభాస్ కెరీర్‌లో 'బాహుబలి' సిరీస్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాలుగు భాషల్లో విడుదల కావడానికి తోడు భారీ బడ్జెట్‌తో వస్తున్న చిత్రం అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడింది. తీరా విడుదలయ్యాక ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ కెల్లెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది సాహో.

టాక్ రాలేదు కానీ కలెక్షన్లు మాత్రం
సాహో సినిమాకు ప్రీమియర్ షోల సమయంలో మంచి టాక్ వచ్చింది. కానీ విడుదలైన రోజు రెండో ఆట నుంచి టాక్ మారిపోయింది. దీంతో మిశ్రమ స్పందనే పరిమితమైంది. అయినప్పటికీ సాహో కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు భాషల్లోనూ రికార్డు లెవెల్ కలెక్షన్లతో సత్తా చాటుతోంది. నాన్ బాహుబలి రికార్డులు తిరగరాస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
5 రోజుల్లోనే 350 కోట్లు
మూడు రోజుల వీకెండ్‌లో భారీ వసూళ్లను రాబట్టిన ‘సాహో'.. వినాయక చవితి రోజు కూడా మంచి వసూళ్లనే సాధించింది. ఇక, మంగళవారం ఈ సినిమాపై స్పందన ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో ఆ రోజు కూడా మంచి వసూళ్లనే రాబట్టిందీ సినిమా. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లో ‘సాహో' రూ. 350 కోట్ల గ్రాస్ సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో హవా
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాహో హవా నడుస్తోంది. తాజాగా ట్రేడ్ అనలిస్టులు అందిస్తున్న సమాచారం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 70.93 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. 5 రోజులు ముగిసినా కూడా సాహో థియేటర్స్ వద్ద కోలాహలం ఏ మాత్రం తగ్గక పోవడం గమనార్హం.

ఏయే ఏరియాలో ఎంత..?
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏరియాల పరంగా చూస్తే సాహో షేర్ రిపోర్ట్ ఇలా ఉంది.
నైజాం: 24.80 కోట్లు
సీడెడ్: 10.25 కోట్లు
ఈస్ట్ గోదావరి: 6.65 కోట్లు
వెస్ట్ గోదావరి: 5.02 కోట్లు
ఉత్తరాంధ్ర: 8.48 కోట్లు
కృష్ణ: 4.64 కోట్లు
గుంటూరు: 7.31 కోట్లు
నెల్లూరు: 3.74 కోట్లు

సాహో మూవీ
తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో ‘సాహో' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో సుజిత్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించింది. పలు భాషల్లోని భారీ తారాగణం పాలుపంచుకుంది.


Click it and Unblock the Notifications











