సాహో ప్రభంజనం: 294 నాటౌట్.. రికార్డులు బద్దలు చేస్తూ బాక్సాఫీస్ జోరు

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 'సాహో' ప్రభంజనాలు ఆగటం లేదు. ప్రభాస్ కెరీర్ లో బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఓ రేంజ్ క్రేజ్ నడుమ ఆగస్టు 30 వ తేదీన నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమాపై నెగెటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. కానీ అవేవీ సాహో ప్రభంజనాలకు బ్రేకులు వేయలేదు. రోజు రోజుకూ సాహో థియేటర్స్ వద్ద కోలాహలం రెట్టింపవుతూ వస్తోంది. రికార్డులు తిరగరాస్తూ బాక్సాఫీస్ జోరు కొనసాగిస్తున్న సాహో కలెక్షన్ అప్‌డేట్ ఇస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

టాక్ ఏదైతేనేం.. కలెక్షన్స్ అదుర్స్

టాక్ ఏదైతేనేం.. కలెక్షన్స్ అదుర్స్

ప్రీమియర్ షోల ద్వారా మంచి టాక్ సొంతం చేసుకున్న సాహో.. విడుదలైన రోజు రెండో ఆట నుంచి ఊహించని రీతిలో నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను కొందరు బాగుందని అంటుండగా, మరికొందరు మాత్రం బాలేదని అంటున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త నిరాశ చెందారు. కానీ కలెక్షన్ల పరంగా సాహో దూసుకుపోతోంది.

ఊహించని రీతిలో వేగంగా డబుల్ సెంచరీ

ఊహించని రీతిలో వేగంగా డబుల్ సెంచరీ

మొదటి రోజు వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ తో కలిసి రూ.130 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సాహో.. రెండో రోజు కూడా అదే రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రభాస్ క్రేజ్‌తో ఈ సినిమా రెండ్రోజుల్లోనే డబుల్ సెంచరీ (రూ.200 కోట్లు) మార్కును అధిగమించి సాహోరే అనిపించింది. దీంతో చిత్రయూనిట్ సహా ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

రికార్డులు తిరగరాస్తూ 294 నాటౌట్

సాహో సినిమా రెండో రోజు జోష్ మూడో రోజూ కొనసాగింది. వీక్ గా ఉన్న టాక్ బలపడటంతో థియేటర్స్ బాట పడుతున్నారు జనం. హాలీడే సీజన్, వీకెండ్ రావడం సాహోకి బాగా కలిసొచ్చింది. దీంతో మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 294 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి వావ్! అనిపించింది సాహో. విడుదలైన నాలుగు భాషల్లోనూ సాహో జోరు రెట్టింపవుతుండటం విశేషం.

 ప్రముఖుల ప్రశంసలు

ప్రముఖుల ప్రశంసలు

సాహో నెగెటివ్ టాక్ సినిమాను ఏ మాత్రం ప్రభావితం చేయలేదు. టాక్ ఎలా ఉన్న ఫ్యాన్ ఇండియా లెవెల్ సినిమా కావడం, హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు
ఉండటం కారణంగా సినిమాపై కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మరోవైపు కేటీఆర్ సహా కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు సాహోకి మంచి బూస్టింగ్ ఇస్తున్నాయి.

సాహో మూవీ

సాహో మూవీ

తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో ‘సాహో' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ‘రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించింది. పలు భాషల్లోని భారీ తారాగణం పాలుపంచుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X