సాహో సెన్సేషన్: సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, కబీర్ సింగ్ రికార్డులు బద్దలు కొట్టిన ప్రభాస్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం 'సాహో'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత వచ్చిన సినిమా కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక, నాలుగు భాషల్లో విడుదల కావడానికి తోడు భారీ బడ్జెట్‌తో వస్తున్న చిత్రం అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ 'సాహో' ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరోగా ప్రభాస్ రికార్డులకెక్కాడు.

 టాక్ ఎలాగున్నా.. కలెక్షన్లు మాత్రం అదుర్స్

టాక్ ఎలాగున్నా.. కలెక్షన్లు మాత్రం అదుర్స్

సాహోకు ప్రీమియర్ షోల సమయంలో మంచి టాక్ వచ్చింది. ఆ తర్వాత విడుదలైన రోజు రెండో ఆట నుంచి టాక్ మారిపోయింది. ఈ సినిమాను కొందరు బాగుందని అంటుండగా, మరికొందరు మాత్రం బాలేదని అంటున్నారు. దీంతో మిశ్రమ స్పందనే ఈ చిత్రం పరిమితమైంది. అయినప్పటికీ సాహో కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు భాషల్లోనూ అత్యధిక కలెక్షన్లతో సత్తా చాటుతోంది.

 రెండు రోజులకే డబుల్ సెంచరీ

రెండు రోజులకే డబుల్ సెంచరీ

మొదటి రోజు వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ తో కలిసి రూ.130 కోట్ల గ్రాస్ వసూలు చేయగా రెండో రోజు కూడా అదే రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రభాస్ క్రేజ్ తో ఈ సినిమా రెండ్రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కును అధిగమించింది. ఈ విషయాన్నీ 'సాహో' నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అధికారికంగా వెల్లడించింది. రెండు రోజుల్లో తమ చిత్రం వరల్డ్ వైడ్ రూ.205 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని యూవీ క్రియేషన్స్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా ఆగడం లేదు

నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా ఆగడం లేదు

సాహో హిందీలో కూడా విడుదలైన విషయం తెలిసిందే. అక్కడ ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాపై నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. అయినప్పటికీ ప్రభాస్ సినిమా హిందీలోనూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే సాహో బాలీవుడ్‌లోని రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ సినిమా మూడు రోజులకు 29-30 కోట్ల రూపాయలు సొంతం చేసుకుని సత్తా చాటుతోంది.

సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, కబీర్ సింగ్ రికార్డులు బద్దలు

సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, కబీర్ సింగ్ రికార్డులు బద్దలు

ప్రభాస్ సినిమా సాహో బాలీవుడ్‌లోని బడా హీరోల రికార్డులు బద్దలు కొట్టేసింది. ఈ సినిమా మూడు రోజుల్లో దాదాపు రూ. 30 కోట్లు కలెక్ట్ చేయడంతో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, కబీర్ సింగ్ రికార్డులు కనుమరుగైపోయాయి. అంతకుముందు కబీర్ సింగ్ మూడు రోజుల్లో రూ. 27.91 కోట్లు కలెక్ట్ చేయగా, సల్మాన్ ఖాన్ భారత్ రూ. 27.90 కోట్లు, అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ రూ. 27.54 కోట్లు వసూలు చేశాయి. వీటిని ఇప్పుడు సాహో అధిగమించింది.

ఈ సంవత్సరంలో మూడో సినిమా

ఈ సంవత్సరంలో మూడో సినిమా

హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా కంటే నెగెటివ్ టాక్ ఉన్న సాహో మూడు రోజులకు భారీ వసూళ్లను సాధించడంతో బాలీవుడ్‌లో ఈ సినిమాపై చర్చ జరుగుతోంది. అంతేకాదు, ఈ సినిమా హిందీలో ఓపెనింగ్ రోజు రూ. 24.40 కోట్లు సాధించింది. తద్వారా ఈ సంవత్సరం విడుదలైన సినిమాల్లో భారత్, మిషన్ మంగళ్ తర్వాత అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. రెండో రోజు నుంచి ఈ సినిమా పుంజుకోవడంతో ఆ రికార్డులు బద్దలయ్యాయి.

సాహో గురించి

సాహో గురించి

తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో ‘సాహో' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ‘రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించింది. ఈ సినిమా ఆగస్టు 30న నాలుగు భాషల్లో విడుదల అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X