సాహో కలెక్షన్ల సునామీ.. 400 కోట్ల క్లబ్‌వైపు పరుగు.. సరికొత్త రికార్డు దిశగా!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా 'సాహో' నాలుగో రోజూ తన జోరు కొనసాగించింది. ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆగస్టు 30వ తేదీన నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా మొదట మిశ్రమ స్పందన తెచ్చుకొని తర్వాత మెల్లగా పుంజుకుంది. రోజు రోజుకూ బాక్సాఫీస్ జోరు పెంచుతూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది సాహో. తాజాగా తొలి నాలుగు రోజుల్లో ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

నెగెటివ్ రివ్యూస్.. నో బ్రేక్స్
నిజానికి సాహో సినిమాపై ఎన్నో నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ అవేవీ సాహో కెలెక్షన్స్‌కి బ్రేకులు వేయక పోవడం విశేషం. రోజు రోజుకూ సాహో థియేటర్స్ వద్ద కోలాహలం రెట్టింపవుతూ వస్తోంది. గత రికార్డులు తిరగరాస్తూ బాక్సాఫీస్ జోరు కొనసాగిస్తున్న ఈ సినిమా తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది.

300 కోట్ల క్లబ్‌లో సాహో
మొదటి రోజు వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ తో కలిసి రూ.130 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సాహో.. రెండో రోజు కూడా అదే రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రభాస్ క్రేజ్‌తో ఈ సినిమా రెండ్రోజుల్లోనే డబుల్ సెంచరీ (రూ.200 కోట్లు) మార్కును అధిగమించి సాహోరే అనిపించింది. ఇక తాజాగా నాలోగో రోజు ముగిసే సరికి 300
కోట్ల అరుదైన మార్క్ చేరుకుంది సాహో.
330 కోట్లు.. నాలుగో బిగ్గెస్ట్ సినిమా
నాలుగు రోజులు ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. సాహో 330 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఈ మేరకు కొత్త పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ ఆనందం వ్యక్తం చేసింది చిత్రయూనిట్. ఇక షేర్ పరంగా చూస్తే నాలుగు రోజుల్లో ఈ సినిమా 165 కోట్లు రాబట్టి.. నాలుగో బిగ్గెస్ట్ సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది.

నెగెటివ్ టాక్ ప్రభావం
సాహోపై వచ్చిన నెగెటివ్ టాక్ సినిమాపై ఏ మాత్రం ప్రభావితం చూపలేదని తెలుస్తోంది. టాక్ ఎలా ఉన్నా ఫ్యాన్ ఇండియా లెవెల్ సినిమా కావడం, హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉండటం కారణంగా సినిమాపై కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మరోవైపు కేటీఆర్ సహా కొందరు సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు సాహోకి మంచి బూస్టింగ్ ఇస్తున్నాయి.

సాహో మూవీ
తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో ‘సాహో' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ‘రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించింది. పలు భాషల్లోని భారీ తారాగణం పాలుపంచుకుంది.


Click it and Unblock the Notifications











