పొరుగు దేశంలో సాహో సునామీ.. అరుదైన ఘనత.. రికార్డులు తిరగరాస్తూ వాటి సరసన!
దేశంలోనే గాక విదేశాల్లో సైతం సాహూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రోజు రోజుకు టాక్ పుంజుకుంటూ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా మెల్లగా అన్ని భాషల్లోనూ జోరు పెంచేసింది. దీంతో ప్రభాస్ ఫాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో 5 రోజులు ముగిసే సరికి విదేశాల్లో సాహో రాబట్టిన వసూళ్ల తాలూకు వివరాలు అందాయి.

విదేశాల్లో సాహో.. సునామీలా కలెక్షన్లు
భారత దేశంలోని అన్ని భాషలతో పాటు పొరుగు దేశం అమెరికాలోనూ సాహో సినిమా సత్తా చాటుతోంది. అక్కడి ప్రేక్షకులు సాహోని పెద్ద ఎత్తున ఆధరిస్తుండటంతో కలెక్షన్ల ప్రవాహం పారుతోంది. అక్కడ కూడా మొదట కాస్త తడబడిన ఈ సినిమా గత మూడు రోజులుగా పుంజుకొంది.

344 సెంటర్లలో సాహో అనిపిస్తూ..
అమెరికా థియేటర్స్ లో సాహోరే అనిపిస్తూ సాహో సినిమా పరుగులు పెడుతోంది. 344 సెంటర్లలో ఈ సినిమా $2,772,700 డాలర్స్ (19.97 కోట్ల రూపాయలు) రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక్క సెప్టెంబర్ 3 వ తేదీనే $145,894 డాలర్లు రాబట్టడం విశేషం.

రంగస్థలం, భరత్ అనే నేను సరసన
ఈ వారాంతంలో సాహో ఓవర్సీస్ మార్కెట్ లో 3 మిలియన్ మార్క్ దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇదే జరిగితే అమెరికాలో 3 మిలియన్ మార్క్ దాటిన 5వ సినిమాగా సాహో తన పేరును లిఖించుకోనుంది. గతంలో బాహుబలి 1, బాహుబలి 2, రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు ఈ ఫీట్ సాధించాయి.

రివ్యూలకు షాకిస్తూ దేశంలో సాహో జోరు
మరోవైపు ఈ సినిమాపై వచ్చిన నెగెటివ్ రివ్యూలకు షాకిస్తూ దేశంలోనూ సాహో జోరు కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగితా ఏరియాల్లోనూ సాహో సునామీ ఆగేలా లేదు. ప్రెసెంట్ పరిస్థితి చూస్తుంటే అతి త్వరలో ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం అని తెలుస్తోంది.

సాహో మూవీ
తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో ‘సాహో' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో సుజిత్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించింది. పలు భాషల్లోని భారీ తారాగణం పాలుపంచుకుంది.


Click it and Unblock the Notifications











