Salaar సినిమాకు అదిరిపోయే ఆఫర్స్.. ఏపి తెలంగాణ రేటు ఎంతంటే?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సలార్. KGF టీమ్ తో ప్రశాంత్ నీల్ తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలన్నాయి. ఈ సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచి విపరీతమైన బజ్‌ను సృష్టిస్తోంది. ఇక అభిమానులు సలార్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల, సలార్ థియేట్రికల్ రైట్స్‌కు చాలా డిమాండ్ ఉందని, కేవలం ఆంధ్రప్రదేశ్ రీజియన్ రైట్స్‌ను మేకర్స్ భారీ రేటును ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

అంచనాలకు తగ్గట్టుగానే
సలర్ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా రానుంది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ అభిమానులు ఈ మూవీ ఎప్పుడు తెరపైకి వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఉండేలా నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక అత్యంత ప్రతిభావంతులైన నటీనటులు ఉన్న ఈ చిత్రం యొక్క స్టార్ కాస్ట్, సినిమాపై మరింత హైప్ పెంచింది.

రాజమౌళి తరహాలో
సలార్ సినిమాతో నటుడిగా ప్రభాస్ మరోసారి తన సత్తా నిరూపించుకోబోతున్నాడు. సలార్ బాహుబలి రేంజ్ కంటే తక్కువేమీ కాదని తెలుస్తోంది. మరోవైపు ప్రశాంత్ నీల్ ఇప్పటికే KGFతో బ్లాక్ బస్టర్ దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ దర్శకుడికి కూడా రాజమౌళి తరహాలో నమ్మకమైన అభిమానుల సంఖ్య ఉంది. ఇక ప్రభాస్‌తో సినిమా కాబట్టి ఆ హైప్‌ని మరింత పెంచింది.

డిజాస్టర్ అయినప్పటికీ
ఇక సలార్ థియేట్రికల్ రైట్స్‌కు అధిక డిమాండ్ ఏర్పడడంతో చిత్రం ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది అనే విషయం ఉత్కంఠను కలిగిస్తోంది. ప్రభాస్ స్టార్ పవర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వ మేధావితో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభాస్ గత రెండు సినిమాలు సాహో, రాధే శ్యామ్ డిజాస్టర్ అయినప్పటికీ సలార్ మార్కెట్ పై ప్రభావం అయితే పడడం లేదని అనిపిస్తోంది.

తెలుగు హక్కుల కోసం
ఇక మిగతా భాషల విషయం పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మరింత డిమాండ్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డీల్ ఇంకా క్లోజ్ కానప్పటికీ, నిర్మాతలు తెలుగు హక్కుల కోసం 100 కోట్ల రూపాయలను కోట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ డీల్ కుదిరితే సినిమా నిర్మాతలకు పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చు.

ఆ రేంజ్ లో బిజినెస్
ఇకపోతే సలార్ సినిమా మిగతా భాషల్లో కూడా భారీ స్థాయిలో బిజినెస్ చేసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా హిందీలోనే ఈ సినిమాకు భారీ ఆఫర్లు వస్తున్నాయి ఇంకా ప్రపంచవ్యాప్తంగా సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈజీగా 1000 కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తప్పకుండా ఈ సినిమా కూడా RRR, KGF 2 రికార్డులను బ్రేక్ చేస్తుంది అని నిర్మాతలు నమ్ముతున్నారు. మరి ఇది ఎంతవరకు ప్రాఫిట్ అందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











