Salaar Bussiness: తెలుగు రాష్ట్రాల్లో మైండ్ బ్లోయింగ్.. నిర్మాతల డిమాండ్ మామూలుగా లేదుగా..
ప్రభాస్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా మూవీ సలార్ సినిమా కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత నీల్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులన్నీ కూడా ఫినిష్ అయ్యాయి. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ సభ్యులు చాలా బిజీగా ఉన్నారు.
ఆ పనులు కూడా తుది దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇటీవల టీజర్ తో సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. రెండు భాగాలుగా రానుందని టీజర్ తో భారీ హైప్ అయితే క్రియేట్ చేశారు. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాతో ప్రభాస్ ఐతే సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

ఎందుకంటే అతను బాహుబలి సినిమా తర్వాత మళ్లీ సక్సెస్ చూడలేదు. సాహో, రాధేశ్యామ్ రెండు కూడా నిరాశ పరచగా ఇటీవల వచ్చిన ఆదిపురుష్ కూడా డిజాస్టర్ అయ్యింది. అందుకే ఇప్పుడు ప్రభాస్ తన ఆశలన్నీ కూడా సలార్ పైన పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఏర్పరచుకుంది.
ఇక చిత్ర నిర్మాణ సంస్థ హోంబల్ ప్రొడక్షన్స్ ఈ సినిమా డిమాండ్ తగ్గట్టుగానే భారీ ధరకు థియేట్రికల్ హక్కులను అమ్మడానికి చూస్తోంది. ఆంధ్రలో 75 కోట్ల రేంజ్ లో రేషియో ఉండే అవకాశం ఉందట. ఇక నైజాం లో కూడా దాదాపు అదే రేంజ్ లో 80 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
తప్పకుండా సినిమా హై రేంజ్ లోనే తెలుగు వెర్షన్ లో 200 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇతర భాషల్లో కూడా సినిమాకు మంచి డిమాండ్ అయితే ఏర్పడుతుంది. మరి ప్రభాస్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











