Salaar Nizam Collections ప్రభాస్ అడ్డా నైజాం గడ్డ.. RRR ఆల్ టైమ్ రికార్డు ఎన్ని లక్షల్లో మిస్ అయిందంటే?
తెలుగు రాష్ట్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం అందరికి తెలిసిందే. అయితే నైజాంలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ మరో హీరో లేదనడం వాస్తవమే. ఇక ఇటీవల రిలీజైన సలార్ మూవీ రెబల్ స్టార్ బాక్సాఫీస్ స్టామినాను చూపించింది. సలార్ చిత్రం నైజాంలో రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. అయితే గతంలో RRR మూవీ సాధించిన ఈ ప్రాంతపు ఆల్‌టైమ్ రికార్డును అధిగమించే ఛాన్స్ మిస్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..
Recommended Video

సలార్ చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను దాదాపు 75 కోట్లకు తీసుకొన్నట్టు సమాచారం. మొత్తంగా తెలుగు రాష్ట్రాల హక్కులు 145 కోట్లకు అమ్ముడుపోయాయనేది ట్రేడ్ వర్గాల టాక్. అయితే నైజాంలో ఈ సినిమా 77 కోట్ల రూపాయల టార్గెట్‌తో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది.

నైజాం ఏరియాలో సలార్ సినిమా భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసింది. ఈ సినిమా కరెంట్ బుకింగ్‌తో కలిపి రికార్డు వసూళ్లను సాధించింది. ఈ సినిమా తొలి రోజు 32 కోట్ల గ్రాస్ రూపాయలను వసూలు చేసింది. ఇక 22.55 కోట్ల జీఎస్టీ తీసివేయగా.. 19 కోట్ల రూపాయల షేర్ సాధించింది. దాంతో ఈ సినిమా నైజాంలో అత్యధిక వసూళ్లు సాధించిన RRR సినిమా తర్వాత రెండో స్థానంలో నిలిచింది.
RRR మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే..ఈ సినిమా నైజాంలో సుమారుగా 33 కోట్ల రూపాయాలు వసూలు చేసింది. అయితే డంకీ సినిమా కారణంగా కొన్ని మల్టీప్లెక్స్‌లో స్క్రీన్లు తగ్గాయి. దాంతో ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసే ఛాన్స్‌ను తృటిలో మిస్ అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

RRR సినిమా మల్టీ స్టారర్ కావడంతో భారీగా రిలీజ్ చేశారు. రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాను నైజాంలో 2850 షోలు ప్రదర్శించారు. ఇక సలార్ విషయానికి వస్తే ఈ సినిమాను 2000 షోలు మాత్రమే వేశారు. ఒకవేళ 2800 షోలు ప్రదర్శించి ఉంటే ప్రభాస్ నైజాంలో రికార్డు వసూళ్లను సాధించే అవకాశం ఉండేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.
ఇక RRR సినిమా కలెక్షన్లను దాటే అవకాశాన్ని సలార్ చాలా తక్కువ మార్చిన్‌తో మిస్ అయింది. 800 షోలు కూడా ప్రదర్శించి ఉంటే ఎవరూ అందుకొలేని వసూళ్లను ప్రభాస్ మూవీ సాధించేది. అయితే 80 లక్షల రూపాయల తేడాతో ఆ రికార్డును అధిగమించే అవకాశాన్ని కోల్పోవడం రెబల్ స్టార్ అభిమానులకు కొంత బాధగా ఉందట. అయితే ఎప్పటికీ ప్రభాస్ అడ్డా నైజాం గడ్డ అని గర్వంగా చెప్పుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











