For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2 Years of Saaho: క్లోజింగ్ కలెక్షన్స్.. ప్రభాస్ ఎందుకు ఒప్పుకున్నాడంటే..?

  |

  రెబల్ స్టార్ ప్రభాస్ సినీ జీవితంలో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రెండవ సినిమా సాహో. బాహుబలి అనంతరం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ తరువాత సినిమా ఎలా ఉంటుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షక అభిమానుల కి ఈ సినిమా పూర్తి స్థాయిలో సంతృప్తి వి ఇవ్వలేకపోయింది. అసలు ప్రభాస్ ఆ సినిమాను ఎందుకు ఒప్పుకున్నాడు అనేది ఇంకా ఓ వర్గం అభిమానులకు క్లారిటీ రావడం లేదు. ఆ విషయంపై అనేక రకాల రూమర్స్ అయితే ఇది వరకే వైరల్ అయ్యాయి.

  ప్రభాస్ తెలియక ఒప్పుకున్నాడా లేకపోతే స్నేహితుల కోసం ఒక సినిమా చేయాల్సి వచ్చిందని అనే కామెంట్స్ కూడా వచ్చాయి. కాని నిజానికి ప్రభాస్ అన్ని తెలిసే ఆ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఆ సినిమా వచ్చి రెండేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై అలాగే సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలపై ఒక లుక్కేద్దాం..

  హీరోయిన్‌ రేంజ్ లో చిరంజీవి డాటర్.. సుస్మిత కొణిదెల రేర్ ఫోటోలు...

  మొదట రైటర్ గా ఛాన్స్..

  మొదట రైటర్ గా ఛాన్స్..

  రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతాయని సాహో సినిమాతో ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ సినిమా కథను ప్రభాస్ బాహుబలి పార్ట్ వన్ విడుదలైనప్పుడు విన్నాడు. అసలైతే ప్రభాస్ బాహుబలి అనంతరం సాహో సినిమా చేయాలని అనుకోలేదు. రన్ రాజా రన్ సినిమా చూసిన అనంతరం డైరెక్టర్ సుజిత్ పనితనం అతన్ని ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో తదుపరి సినిమాకు రైటర్ గా వర్క్ చేసే అవకాశం ఇస్తానని కూడా చెప్పాడు.

  Mega Star with Sport Stars.. చిరంజీవితో మీరెప్పుడూ చూడని లెజెండ్స్ ఫోటోలు!

  కథ నచ్చడంతో..

  కథ నచ్చడంతో..

  అయితే సుజిత్ మాత్రం ప్రభాస్ తో ఒక సినిమా చేయాలని తప్పకుండా కొంత సమయం ఇస్తే మంచి కథ కూడా చెబుతాను అని అన్నాడు. దీంతో ప్రభాస్ కూడా అతనికి మంచి బూస్ట్ ఇచ్చే విధంగా సరే అని కథ నచ్చకపోతే మాత్రం నో చెబుతాను అని కూడా అన్నాడు.

  దీంతో దాదాపు నాలుగైదు నెలలు కష్టపడి సాహో అసలు కథను ప్రభాస్ కు వినిపించాడు. కథ మెయిన్ పాయింట్ నచ్చడంతో ప్రభాస్ కొన్ని మార్పులు తప్పనిసరిగా అవసరమని సలహాలు కూడా ఇచ్చాడట. మరి కొంత కాలం పాటు ఆ కథపై కూర్చున్నా సుజిత్ మొత్తానికి ప్రభాస్ ఆలోచనలకు తగ్గట్టు గానే ఈ కథను రెడీ చేశాడు.

  సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ బ్యూటీఫుల్ ఫొటోస్.. ఆ స్మైల్ కు ఫిదా అవ్వాల్సిందే!

  అక్కడ తప్పితే.. మరెక్కడా లాభాలను అంధించలేదు

  అక్కడ తప్పితే.. మరెక్కడా లాభాలను అంధించలేదు

  సుజిత్ మీద నమ్మకంతో పాట యువి క్రియేషన్స్ కోసం కూడా ఒక సినిమా చేయాలని ప్రభాస్ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. అందుకే సాహో సినిమా భారీ స్థాయిలో నిర్మించేందుకు ఒప్పుకున్నాడు. అయితే ఆ సినిమా అంచనాలను మాత్రం పూర్తిస్థాయిలో అందుకోలేకపోయింది. ఓ వర్గం ప్రేక్షకులు మాత్రమే ఆ సినిమాను అద్భుతంగా నచ్చేసింది.

  అలాగే నార్త్ లో కూడా సినిమాపై పెట్టిన పెట్టుబడికి అక్కడి బయ్యర్లకు కొంత లాభాలను కూడా అందించింది. అయితే అక్కడ తప్పితే సినిమా మరెక్కడా కూడా లాభాలు అందించే విధంగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. తమిళ్ తెలుగు మలయాళం కన్నడ లో కూడా భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది.

  Shruti Hassan : పదిహేడేళ్ళప్పుడు ఎలా ఉందో చూశారా?

  అసలు బడ్జెట్ ఎంతంటే?

  అసలు బడ్జెట్ ఎంతంటే?

  ప్రభాస్ స్నేహితుల ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తగ్గట్లుగానే నిర్మించింది. మొదట 70 కోట్ల బడ్జెట్ లోనే పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ లెక్క 250 కోట్లను దాటినట్లు తెలుస్తోంది. కొందరైతే ఈ సినిమా కోసం మూడు వందల కోట్లకు పైగా ఖర్చు చేశారని కూడా కథనాలు అల్లేశారు. కానీ యూవీ నిర్మాతలు ఎంత ఖర్చు చేశారనేది వారికే తెలియాలి. మొత్తానికి బిజినెస్ వలన నిర్మాతలు అయితే సేఫ్ అయ్యారు. కానీ ఈ సినిమాపై పెట్టుబడి పెట్టిన బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు మాత్రం భారీ స్థాయిలో నష్టపోయారని తెలుస్తోంది.

  నష్టం ఎంతంటే?

  నష్టం ఎంతంటే?

  మొత్తం ఆంధ్రప్రదేశ్+నైజాం ఏరియాలలో 80.60 కోట్ల షేర్ అందుకున్న సాహో కర్ణాటకలో 14.00 కోట్లను రాబట్టింది. తమిళనాడు 4.80 కోట్లు, కేరళ 1.60 కోట్లు, ఉత్తర భారతదేశం 82.00 కోట్లు, మొత్తం భారతదేశంలో 183.00 కోట్ల వరకు షేర్ ను రాబట్టినట్లు సమాచారం. మొత్తం ప్రీ-రిలీజ్ బిజినెస్ 287.0 కోట్ల వరకు జరిగిందట. వరల్డ్ వైడ్ గా మొత్తం వచ్చిన కలెక్షన్లు 213.40 కోట్లు అని తెలుస్తోంది. ఇక సినిమాకు ఫైనల్ గా 73.60 కోట్ల నష్టంతో ఫ్లాప్ అయినట్లు సమాచారం.

  ఏ మంత్రం తొందరపడినా

  ఏ మంత్రం తొందరపడినా

  ప్రభాస్ లాంటి స్టార్ హీరోను కేవలం యాక్షన్ సీన్స్ కోసం ఎక్కువగా వాడుకున్నట్లు టాక్ వచ్చింది. అతనిలో ఒక మంచి నటుడు కూడా ఉన్నాడని దర్శకుడు సుజిత్ ఆ కోణంలో ఎక్కువగా ఉపయోగించుకోలేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు స్క్రీన్ ప్లే మోజులోపడి దర్శకుడు కాస్త తడబడ్డాడు అని కూడా సీనియర్ రైటర్ లు డైరెక్ట్ గా కామెంట్స్ చేశారు.

  నాన్ థియేట్రికల్ బిజినెస్ అలాగే సినిమాను కొన్ని ఏరియాలలో భారీ ధరకు అమ్మడం వలన యు.వి.క్రియేషన్స్ చాలా తొందరగానే సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. ఆ విషయంలో ఏ మాత్రం తొందర పడినా కూడా నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలు మిగిలేవి.

  English summary
  Prabhas second pan india movie completes 2 Years of Saaho box office collections..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X