Adipurush 10 Days Collections: సండే ఊహించని విధంగా.. 10 రోజుల్లో ఇంతేనా.. ఇంకా అన్ని కోట్లు రావాలా!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రమే 'ఆదిపురుష్'. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు తగ్గట్లుగానే అత్యధిక బిజినెస్‌ను జరుపుకుని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఫస్ట్ వీకెండ్ భారీ వసూళ్లు దక్కాయి. ఆ తర్వాత నుంచి క్రమంగా పడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆదివారం కాస్త వసూళ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' మూవీ 10 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

రామాయణంతో మరోసారిగా:యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమానే 'ఆదిపురుష్'. ఓం రౌత్ తీసిన ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. ఇందులో ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. అజయ్, అతుల్ మ్యూజిక్ ఇచ్చారు.

Prabhas Starrer Adipurush Movie 10 Days Worldwide Official Collections

ఆదిపురుష్ బిజినెస్ ఎంత?:ఎంతో మంది స్టార్లు నటించిన 'ఆదిపురుష్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ దాదాపు రూ. 120 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 240 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ను జరుపుకుంది.

10వ రోజు తెలుగు వసూళ్లిలా:'ఆదిపురుష్' మూవీకి 10వ రోజు ఏపీ, తెలంగాణలో వసూళ్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 81 లక్షలు, సీడెడ్‌లో రూ. 35 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 31 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, గుంటూరులో రూ. 12 లక్షలు, కృష్ణాలో రూ. 14 లక్షలు, నెల్లూరులో రూ. 9 లక్షలతో.. రూ. 2.13 కోట్లు షేర్, రూ. 4.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Prabhas Starrer Adipurush Movie 10 Days Worldwide Official Collections

10 రోజుల్లో తెలుగు కలెక్షన్లు:'ఆదిపురుష్'కు 10 రోజులకు తెలుగులో వసూళ్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 35.69 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.62 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 10.21 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.99 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.31 కోట్లు, గుంటూరులో రూ. 6.63 కోట్లు, కృష్ణాలో రూ. 4.43 కోట్లు, నెల్లూరులో రూ. 2.25 కోట్లతో.. రూ. 79.13 కోట్లు షేర్, రూ. 127.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Prabhas Starrer Adipurush Movie 10 Days Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:భారీ బడ్జెట్‌తో వచ్చిన 'ఆదిపురుష్' మూవీకి 10 రోజులకు కలిపి తెలుగులో రూ. 79.13 కోట్లు, తమిళంలో రూ. 2.39 కోట్లు, కర్నాటకలో రూ. 12.15 కోట్లు, కేరళలో రూ. 87 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 68.45 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 24.40 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లో రూ. 187.39 కోట్లు షేర్, రూ. 379.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

Prabhas Starrer Adipurush Movie 10 Days Worldwide Official Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి:'ఆదిపురుష్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 240 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 242 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. కానీ, 10 రోజుల్లో దీనికి రూ. 187.39 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. ఇంకా ఇది రూ. 54.61 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సిన అవసరం ఉంది.

Prabhas Starrer Adipurush Movie 10 Days Worldwide Official Collections

భారీగానే.. నష్టాలు ఖాయం:'ఆదిపురుష్' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10వ రోజైన ఆదివారం కలెక్షన్లు డబుల్ అయ్యాయి. దీంతో ఈ చిత్రం రూ. 2 కోట్ల మార్కును కూడా దాటింది. అయినప్పటికీ సోమవారం నుంచి దీనికి రెస్పాన్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. దీనికితోడు విజయం సాధించడానికి ఇంకా రూ. 50 కోట్లకు పైగానే వసూలు చేయాల్సి ఉంది. కాబట్టి దీనికి నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X