Adipurush 11 Days Collections: 11వ రోజు ఢమాల్.. కోట్లు నుంచి లక్షలకు.. కోట్ల నష్టాల దిశగా ఆదిపురుష్
తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చినా.. దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తూ పాన్ ఇండియా హీరోగా సత్తా చాటుతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ జోష్‌లోనే అతడు కొంత కాలంగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇలా ఇటీవలే ఈ బడా హీరో 'ఆదిపురుష్' అనే సినిమాతో వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా పెద్దగా రాణించడం లేదు. ఈ క్రమంలోనే వీకెండ్ ముగిసే సరికి మళ్లీ భారీగా పతనం అయిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీ 11 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!
రాఘవుడిగా ప్రభాస్ ఎంటర్:ప్రభాస్ హీరోగా తెరకెక్కిన విజువల్ వండర్ మూవీనే 'ఆదిపురుష్'. ఓం రౌత్ తీసిన ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. ఇందులో ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. అజయ్, అతుల్ మ్యూజిక్ అందించారు.

ఆదిపురుష్ బిజినెస్ ఎంత?:అత్యంత భారీ బడ్జెట్‌తో వచ్చిన 'ఆదిపురుష్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ దాదాపు రూ. 120 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 240 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయింది.
11వ రోజు తెలుగు వసూళ్లిలా:'ఆదిపురుష్' మూవీకి 11వ రోజు ఏపీ, తెలంగాణలో వసూళ్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 34 లక్షలు, సీడెడ్‌లో రూ. 12 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రూ. 74 లక్షలు షేర్, రూ. 1.15 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

11 రోజుల్లో తెలుగు కలెక్షన్లు:11 రోజులకు 'ఆదిపురుష్'కు తెలుగులో వసూళ్లు తక్కువే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 36.03 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.74 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 10.32 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.04 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.35 కోట్లు, గుంటూరులో రూ. 6.65 కోట్లు, కృష్ణాలో రూ. 4.47 కోట్లు, నెల్లూరులో రూ. 2.27 కోట్లతో.. రూ. 79.87 కోట్లు షేర్, రూ. 128.75 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:హై రేంజ్‌లో రూపొందిన 'ఆదిపురుష్' మూవీకి 11 రోజులకు కలిపి తెలుగులో రూ. 79.87 కోట్లు, తమిళంలో రూ. 2.41 కోట్లు, కర్నాటకలో రూ. 12.24 కోట్లు, కేరళలో రూ. 87 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 69.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 24.50 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లో రూ. 188.94 కోట్లు షేర్, రూ. 451 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి:'ఆదిపురుష్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 240 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 242 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. కానీ, 11 రోజుల్లో దీనికి రూ. 188.94 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. ఇంకా ఇది రూ. 53.06 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సిన అవసరం ఉంది.

కోట్ల నష్టాల దిశగా ఆదిపురుష్:యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీకి రెండో వీకెండ్‌లో కూడా భారీ వసూళ్లే వచ్చాయి. కానీ, ఆ తర్వాత అంటే సోమవారం భారీగా పడిపోయాయి. ఇక, ఈ వారం మొత్తం ఇదే రన్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే, గురువారం చాలా చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటన్నింటి వల్ల ఈ సినిమాకు దాదాపు రూ. 50 కోట్లు నష్టాలు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











