Adipurush 12 Days Collections: ప్రభాస్‌కు బిగ్ షాక్.. మరీ ఇంత తక్కువగానా.. ఇంకెన్ని కోట్లు రావాలంటే!

ఇండియాలోని అన్ని ఇండస్ట్రీల నుంచి ఎన్నో రకాల చిత్రాలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే విడుదలకు ముందే భారీ స్థాయిలో హైప్‌ను క్రియేట్ చేసుకుంటాయి. అలాంటి వాటిలో 'ఆదిపురుష్' ఒకటి. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా రామాయణం నేపథ్యంతో తెరకెక్కడంతో ఆరంభంలోనే అంచనాలను ఏర్పరచుకుంది. కానీ, వాటిని అందుకోవడంలో మాత్రం విఫలం అయింది. దీంతో దీనికి కలెక్షన్లు ఆశించిన రీతిలో రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ 12 రోజుల రిపోర్టును మీరే చూసేయండి!

రాముడిగా మారిన ప్రభాస్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రమే 'ఆదిపురుష్'. ఓం రౌత్ తీసిన ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్, అతుల్ మ్యూజిక్ అందించారు. ఇందులో ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు.

Adipurush 12 Days Collections

ఆదిపురుష్ బిజినెస్ ఎంత?: విజువల్ వండర్‌గా తెరకెక్కిన 'ఆదిపురుష్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ దాదాపు రూ. 120 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 240 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌‌ను చేసుకుంది.

Adipurush 12 Days Collections

12 రోజుల్లో తెలుగు కలెక్షన్లు: 'ఆదిపురుష్'కు తెలుగులో 12 రోజులకు వసూళ్లు తక్కువే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 36.24 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.81 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 10.39 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.07 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.38 కోట్లు, గుంటూరులో రూ. 6.67 కోట్లు, కృష్ణాలో రూ. 4.49 కోట్లు, నెల్లూరులో రూ. 2.28 కోట్లతో.. రూ. 80.33 కోట్లు షేర్, రూ. 129.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: హై రేంజ్‌లో రూపొందిన 'ఆదిపురుష్' మూవీకి 12 రోజులకు కలిపి తెలుగులో రూ. 80.33 కోట్లు, తమిళంలో రూ. 2.43 కోట్లు, కర్నాటకలో రూ. 12.30 కోట్లు, కేరళలో రూ. 87 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 69.45 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 24.62 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 12 రోజుల్లో రూ. 190.00 కోట్లు షేర్, రూ. 453 కోట్లు గ్రాస్ వచ్చింది.

Adipurush 12 Days Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి:'ఆదిపురుష్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 240 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 242 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. కానీ, 12 రోజుల్లో దీనికి రూ. 190.00 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. ఇంకా ఇది రూ. 52.00 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సిన అవసరం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X