Adipurush 13Days Collections: ఇదేం దెబ్బ సామీ.. పాన్ ఇండియా మూవీకి ఈ పరిస్థితా.. కోట్ల నష్టాల దిశగా!
ప్రస్తుతం సౌతిండియాలోని ఎంతో మంది హీరోలు పాన్ ఇండియా స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. అందులో తెలుగు ఇండస్ట్రీ నుంచే చాలా మంది ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మాత్రం ప్రభాస్‌దే. ఫలితాలతో సంబంధం లేకుండా భారీ చిత్రాలనే చేస్తున్న ప్రభాస్.. ఇటీవలే 'ఆదిపురుష్' అనే మూవీతో వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీకి ఆశించిన రీతిలో స్పందన రావట్లేదు. ఫలితంగా కలెక్షన్లు పడిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో యంగ్ రెబెల్ స్టార్ 'ఆదిపురుష్' మూవీ 13 రోజుల రిపోర్టును మీరే చూసేయండి!
భారీ బడ్జెట్‌తో వచ్చేసింది:ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమానే 'ఆదిపురుష్'. ఓం రౌత్ తీసిన ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్, అతుల్ మ్యూజిక్ అందించారు. ఇందులో ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడి పాత్రలను చేశారు.

ఆదిపురుష్ బిజినెస్ ఎంత?:హై రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కిన 'ఆదిపురుష్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ దాదాపు రూ. 130 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 240 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
13వ రోజు తెలుగు వసూళ్లిలా:'ఆదిపురుష్' మూవీకి 13వ రోజు ఏపీ, తెలంగాణలో వసూళ్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 32 లక్షలు షేర్, రూ. 60 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

13 రోజుల్లో తెలుగు కలెక్షన్లు:13 రోజులకు 'ఆదిపురుష్'కు తెలుగులో వసూళ్లు తక్కువే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 36.38 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.86 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 10.44 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.09 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.40 కోట్లు, గుంటూరులో రూ. 6.68 కోట్లు, కృష్ణాలో రూ. 4.51 కోట్లు, నెల్లూరులో రూ. 2.29 కోట్లతో.. రూ. 80.65 కోట్లు షేర్, రూ. 130.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:ఎంతో మంది స్టార్లు నటించిన 'ఆదిపురుష్' మూవీకి 13 రోజులకు కలిపి తెలుగులో రూ. 80.65 కోట్లు, తమిళంలో రూ. 2.45 కోట్లు, కర్నాటకలో రూ. 12.35 కోట్లు, కేరళలో రూ. 87 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 69.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 24.68 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 13 రోజుల్లో రూ. 190.65 కోట్లు షేర్, రూ. 454 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి:'ఆదిపురుష్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 240 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 242 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. కానీ, 13 రోజుల్లో దీనికి రూ. 190.65 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. ఇంకా ఇది రూ. 51.35 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications











