Adipurush 15 Days Collections: 600 కోట్ల మూవీ.. అప్పుడే ఇంత దారుణమా? ఎన్ని కోట్లు రావాలో తెలిస్తే!

ఈ మధ్య కాలంలో ఇండియాలో రూపొందే చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా హైలైట్ అవుతున్నాయి. తద్వారా విదేశాల్లో సైతం అంచనాలను ఏర్పరచుకుంటున్నాయి. అలాంటి వాటిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' ఒకటి. రామాయణం నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకుంది. కానీ, ఎవరూ ఊహించని రీతిలో నెగెటివ్ టాక్‌ను తెచ్చుకుని కలెక్షన్లను రాబట్టడంలో ఇబ్బందులు పడుతోంది. ఇలా 3వ వారాన్ని దారుణంగా స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' మూవీ 15 రోజుల రిపోర్టును మీరే చూడండి!

600 కోట్ల బడ్జెట్‌తో వచ్చింది:ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 600 కోట్లు బడ్జెట్ మూవీనే 'ఆదిపురుష్'. ఓం రౌత్ తీసిన ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. ఇందులో ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. అజయ్, అతుల్ మ్యూజిక్ అందించారు.

Adipurush 15 Days

ఆదిపురుష్ బిజినెస్ ఎంత?:ఎంతో మంది స్టార్లు నటించిన 'ఆదిపురుష్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ దాదాపు రూ. 150 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 240 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌‌ను జరుపుకుంది.

15వ రోజు తెలుగు వసూళ్లిలా: 'ఆదిపురుష్' మూవీకి 15వ రోజు ఏపీ, తెలంగాణలో వసూళ్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రూ. 26 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

Adipurush 15 Days

15 రోజుల్లో తెలుగు కలెక్షన్లు: 'ఆదిపురుష్'కు తెలుగులో 15 రోజులకు వసూళ్లు తక్కువే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 36.65 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.95 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 10.53 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.17 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.46 కోట్లు, గుంటూరులో రూ. 6.74 కోట్లు, కృష్ణాలో రూ. 4.58 కోట్లు, నెల్లూరులో రూ. 2.34 కోట్లతో.. రూ. 81.42 కోట్లు షేర్, రూ. 131.55 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: భారీ బడ్జెట్‌తో రూపొందిన 'ఆదిపురుష్' మూవీకి 15 రోజులకు కలిపి తెలుగులో రూ. 81.42 కోట్లు, తమిళంలో రూ. 2.45 కోట్లు, కర్నాటకలో రూ. 12.39 కోట్లు, కేరళలో రూ. 87 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 69.92 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 24.75 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 15 రోజుల్లో రూ. 191.80 కోట్లు షేర్, రూ. 456 కోట్లు గ్రాస్ వచ్చింది.

 Adipurush

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి: 'ఆదిపురుష్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 240 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 242 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. కానీ, 15 రోజుల్లో దీనికి రూ. 191.80 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. ఇంకా ఇది రూ. 50.20 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సిన అవసరం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X