Adipurush 18 Days Collections: 'ఆదిపురుష్'కు దారుణంగా వసూళ్లు.. అన్ని కోట్లు వస్తేనే హిట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. ప్రముఖ హిందీ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కించిన ఈ సినిమాకు ఆది నుంచి విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ట్రైలర్ తో ట్రోలింగ్ కు చెక్ పెట్టిన మేకర్స్.. సినిమా విడుదల తర్వాత మాత్రం మొదటికి మించి నెగెటివిటీని మూటగట్టుకున్నారు. సినిమా రిలీజై 18 రోజులు కావొస్తున్న ఎక్కడో ఓ చోట ఏదో ఒక విమర్శ వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ 18 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

నటీనటులు:రామాయణం కథ ఆధారంగా రూపొందిన ప్రభాస్ మూవీ ఆదిపురుష్. శ్రీరాముడిగా ప్రభాస్ అలరించిన ఈ సినిమాలో పరమ శివ భక్తుడు రావణ బ్రహ్మగా సైఫ్​ అలీ ఖాన్, సీతాదేవిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్​, హనుమంతుడిగా మరాఠీ పాపులర్ యాక్టర్ దేవదత్తా నాగే, లక్ష్మణుడిగా బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ చేశారు. వీళ్లే కాకుండా హాట్ బ్యూటి సోనాల్ చౌహన్, తేజస్విని పండిట్, వత్సల్ సేథ్ నటించారు.

Prabhas Starrer Adipurush Movie 18 Days Worldwide Official Collections

బిజినెస్:హై రేంజ్ గ్రాఫికల్ విజువల్స్‌తో రూపొందిన ఆదిపురుష్ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ప్రభాస్ మార్కెట్ కు తగినట్లుగానే మూవీ రైట్స్ కు హై డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ చిత్రం సుమారు రూ. 160 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ అన్నీ కలిపి రూ. 240 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో:ప్రభాస్-ఓం రావత్ కాంబినేషన్ లో తొలిసారిగా వచ్చిన ఆదిపురుష్ సినిమాకు నాలుగో వారంలో కలెక్షన్స్ ఘోరంగా పడిపోయాయి. 18వ రోజున ఏపీ తెలంగాణలోని నైజాం, సీడెడ్‌, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు అన్నీ ఏరియాలు కలుపుకును కేవలం రూ. 9 లక్షలు మాత్రమే వచ్చింది. సినిమా విడుదలైన 18 రోజుల్లో ఇంత దారుణంగా కలెక్షన్స్ ఎప్పుడూ రాలేదు.

Prabhas Starrer Adipurush Movie 18 Days Worldwide Official Collections

18 రోజుల్లో:ఆదిపురుష్ సినిమాకు రోజు రోజు వసూళ్లు తగ్గుతున్నాయి. ఫలింతగా 18 రోజుల్లో రూ. 36.88 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.02 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 10.62 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.22 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.51 కోట్లు, గుంటూరులో రూ. 6.79 కోట్లు, కృష్ణాలో రూ. 4.64 కోట్లు, నెల్లూరులో రూ. 2.39 కోట్లు వచ్చాయి. మొత్తంగా రూ. 82.02 కోట్లు షేర్, రూ. 132.75 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Prabhas Starrer Adipurush Movie 18 Days Worldwide Official Collections

వరల్డ్ వైడ్ గా:రాఘవుడిగా ప్రభాస్, జానకిగా కృతీ సనన్ అలరించిన ఆదిపురుష్ సినిమాకు 18 రోజుల్లో రూ. రూ. 82.02 కోట్లు రాగా.. తమిళంలో రూ. 2.47 కోట్లు, కర్నాటకలో రూ. 12.43 కోట్లు, కేరళలో రూ. 87 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 70.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 24.80 కోట్లు షేర్ వచ్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 18 రోజుల్లో రూ. 192.84 కోట్ల షేర్, రూ. 391.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

Prabhas Starrer Adipurush Movie 18 Days Worldwide Official Collections

హిట్ టాక్ రావాలంటే?:గ్రేటెస్ట్ మైథాలాజికల్ స్టోరీగా గుర్తింపు పొందిన రామయణం ప్రేరణతో తెరకెక్కించిన ఆదిపురుష్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో సినిమాకు రూ. 242 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. కానీ 18 రోజుల్లో రూ. 192.84 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. అంటే ఇంకా రూ. 49.16 కోట్ల షేర్ వస్తేనే టార్గెట్ రీచ్ హిట్ టాక్ తెచ్చుకుంటుంది. ఒకవేళ అన్ని కోట్లు రాకుంటే ప్రభాస్ కెరీర్ లో మరో ప్లాప్ ఉన్నట్లే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X