Adipurush 19 Days Collections: పాతాళానికి పడిపోయిన ఆదిపురుష్ కలెక్షన్స్.. వచ్చింది లక్షల్లోనే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాపై అభిమానులు, ప్రేక్షకులు ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే. కానీ సినిమా విడుదల తర్వాత ఆ అంచనాలు తారుమారు, ఆశలు గల్లంతు అయ్యాయి. రామాయణ కథాంశంతో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా విడుదలకు ముందు ఓ మాట, తర్వాత మరో మాట చెబుతూ మేకర్స్ నెట్టుకొస్తున్నారు. నెగెటివిటినీ పొగొట్టాలని చేస్తున్న ఏ ప్రయత్నం ఫలించకపోగా కలెక్షన్స్ భారీగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ 19 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయంటే?
బాక్సాఫీస్ కష్టాలు:ఆదిపురుష్ సినిమాను తానాజీ వంటి హిట్ ఇచ్చిన హిందీ దర్శకుడు ఓం రావత్ డైరెక్ట్ చేశారు. ఇక ఆది నుంచే సినిమా, దర్శకుడిపై బీభత్సమైన విమర్శలు వెల్లువెత్తాయి. మూవీ విడుదల తర్వాత అంటే జూన్ 16 నుంచి ఈ నెగెటివిటీ మరింత తీవ్రతరం అయింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తెచ్చుకునేందుకు కష్టాలు పడుతోంది.

ప్రీ రిలీజ్ బిజినెస్:బాహుబలి సినిమాతో గ్లోబల్ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. దీంతో అతని మార్కెట్ పెరిగింది. అందుకే ఆదిపురుష్ సినిమాకు భారీ మార్కెట్ ఏర్పడింది. అలాగే సినిమా అంచనాలు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదిపురుష్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 160 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ అన్నీ కలిపి రూ. 240 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

నెట్ కలెక్షన్స్:ప్రభాస్-కృతీ సనన్ తొలిసారి జోడి కట్టిన చిత్రం ఆదిపురుష్ సినిమాను థియేటర్లు వరుసగా ఎత్తేస్తున్నాయి. దీంతో పలు చోట్ల కలెక్షన్స్ ఏమాత్రం వసూలు కావడం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో 17వ రోజు రూ. 24 లక్షలు రాగా.. 18వ రోజు 9 లక్షలు మాత్రమే వచ్చింది. అలాగే 18వ రోజు ఇండియా వ్యాప్తంగా రూ. 50 లక్షల వరకు రాగా.. తాజాగా 19వ రోజు రూ. 44 లక్షల నెట్ కలెక్షన్స్ వసూళు చేసినట్లు సమాచారం.

19 రోజుల్లో:బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్, మరాఠీ పాపులర్ యాక్టర్ దేవదత్తా నాగే వంటి వాళ్లు నటించిన ఆదిపురుష్ సినిమాకు సంగీతం హైలెట్ గా నిలిచిందనే పాజిటివ్ టాక్ వచ్చింది. అయినా అది వసూళ్లు పెరుగుదలపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఇక ఈ సినిమాకు 19 రోజుల్లో రూ. 286.26 ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు లెక్కలు చూపాయి.

20వ రోజున ఎంతంటే?:మహా కావ్యమైన రామయణం కథ నుంచి ప్రేరణ పొంది తెరకెకించామని రచయిత మనోజ్ ముంతాషీర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అవేవి వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పటివరకు 19 రోజుల బాక్సాఫీస్ వసూళ్లు లెక్కలు బయటకు రాగా 20 రోజున కూడా ఆదిపురుష్ సినిమా ఎంత కలెక్ట్ చేయగలదో సినీ విశ్లేషకులు తెలిపారు. 20 వ రోజున రూ. 20 లక్షల నెట్ కలెక్షన్స్ మాత్రమే సాధిస్తుందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











