Adipurush 1st Week Collections: 242 కోట్లు టార్గెట్.. ఒక్కసారిగా అన్ని కోట్లు డౌన్.. హిట్ అవ్వాలంటే!

కొంత కాలంగా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్నాడు మన తెలుగు హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా ఇప్పటికే కొన్ని భారీ చిత్రాలతో వచ్చిన అతడు.. ఇప్పుడు 'ఆదిపురుష్' అనే మైథాలజీ మూవీతో వచ్చాడు. ప్రకటన సమయం నుంచే భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం గత వారంలోనే ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే, దీనికి మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు. ముఖ్యంగా వీక్ డేస్‌లో తేలిపోయింది. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' మూవీ వారం రోజుల వసూళ్లను మీరే చూడండి!

టెక్నికల్ వండర్‌గా వచ్చింది: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. ఓం రౌత్ రూపొందించిన చిత్రమే 'ఆదిపురుష్'. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్ - అతుల్ సంగీతం ఇచ్చారు. ఇందులో ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు.

Adipurush 1st Week Collections:

ఆదిపురుష్ బిజినెస్ ఎంత?:అత్యంత భారీ బడ్జెట్‌తో తీసిన 'ఆదిపురుష్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ దాదాపు రూ. 120 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 240 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్

జరిగింది.7వ రోజు తెలుగు వసూళ్లిలా: 'ఆదిపురుష్' మూవీ 7వ రోజు ఏపీ, తెలంగాణలో భారీగా పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 38 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రూ. 97 లక్షలు షేర్, రూ. 1.75 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

7 రోజుల్లో తెలుగు కలెక్షన్లు: 'ఆదిపురుష్' తెలుగు రాష్ట్రాల్లో 7 రోజులకు తక్కువ వసూళ్లే సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 34.25 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.03 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 9.66 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.65 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.00 కోట్లు, గుంటూరులో రూ. 6.40 కోట్లు, కృష్ణాలో రూ. 4.18 కోట్లు, నెల్లూరులో రూ. 2.10 కోట్లతో.. రూ. 75.27 కోట్లు షేర్, రూ. 120.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Adipurush

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: టెక్నికల్ వండర్‌గా వచ్చిన 'ఆదిపురుష్' మూవీకి 7 రోజులకు కలిపి తెలుగులో రూ. 75.27 కోట్లు, తమిళంలో రూ. 2.30 కోట్లు, కర్నాటకలో రూ. 11.70 కోట్లు, కేరళలో రూ. 82 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 64.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 23.30 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లో రూ. 178.09 కోట్లు షేర్, రూ. 359.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి: 'ఆదిపురుష్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 240 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 242 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. కానీ, వారం రోజుల్లో దీనికి రూ. 178.09 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. ఇంకా ఇది రూ. 63.91 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సిన అవసరం ఉంది.

Adipurush

ఒక్కసారిగా అన్ని కోట్లు డౌన్: 'ఆదిపురుష్' మూవీకి మొదటి వీకెండ్‌లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే స్పందన వచ్చింది. ఫలితంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. కానీ, నాలుగో రోజు నుంచి క్రమంగా పడిపోతూనే వస్తోంది. ఇలా నాలుగు రోజులకు కలిపి రూ. 100 కోట్లు లోపే గ్రాస్ రాబట్టింది. ఇదే కంటిన్యూ అయితే ఈ చిత్రానికి రూ. 40 కోట్ల వరకూ నష్టం రావొచ్చని టాక్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X