Adipurush 2 Days Collections: 2వ రోజూ సంచలనమే.. నాన్ RRR రికార్డు బ్రేక్.. మొత్తం అన్ని కోట్లా!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రమే 'ఆదిపురుష్'. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. దీంతో విడుదలకు ముందే ఈ మూవీ బోలెడన్ని అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా ఈ చిత్రం కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసింది. ఈ పరిస్థితుల్లో ఈ టెక్నికల్ వండర్ మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి మొదటి రోజు భారీ వసూళ్లు వచ్చాయి. రెండో రోజు కూడా ప్రభాస్ మూవీ బాగానే రాబట్టింది. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

శ్రీరాముడిగా ప్రభాస్ సందడి:యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో రూపొందిన చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో అతడు రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్ - అతుల్ దీనికి మ్యూజిక్ అందించారు.

Prabhas Starrer Adipurush Movie 2 Days Telugu Official Collections

ఆదిపురుష్ బిజినెస్ ఎంత?:టెక్నికల్ వండర్‌గా రూపొందిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన 'ఆదిపురుష్' మూవీ అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 120 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 240 కోట్ల మేర బిజినెస్ అయింది.

2వ రోజు తెలుగు వసూళ్లిలా:'ఆదిపురుష్' మూవీ 2వ రోజూ ఏపీ, తెలంగాణలో బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 7.78 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.74 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.10 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 94 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 58 లక్షలు, గుంటూరులో రూ. 85 లక్షలు, కృష్ణాలో రూ. 65 లక్షలు, నెల్లూరులో రూ. 40 లక్షలతో.. రూ. 15.04 కోట్లు షేర్, రూ. 24.85 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Prabhas Starrer Adipurush Movie 2 Days Worldwide Official Collections

2 రోజుల్లో తెలుగు కలెక్షన్లు:2 రోజులకు 'ఆదిపురుష్' తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 21.46 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.26 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.82 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.72 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.82 కోట్లు, గుంటూరులో రూ. 4.85 కోట్లు, కృష్ణాలో రూ. 2.65 కోట్లు, నెల్లూరులో రూ. 1.30 కోట్లతో.. రూ. 47.88 కోట్లు షేర్, రూ. 74.75 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:'ఆదిపురుష్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి రెండు రోజులకు కలిపి తెలుగులో రూ. 47.88 కోట్లు, తమిళంలో రూ. 1.05 కోట్లు, కర్నాటకలో రూ. 7.60 కోట్లు, కేరళలో రూ. 42 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 35.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 16.25 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 108.50 కోట్లు షేర్, రూ. 214 కోట్లు గ్రాస్ వచ్చింది.

Prabhas Starrer Adipurush Movie 2 Days Worldwide Official Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి:'ఆదిపురుష్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 240 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 242 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. కానీ, 2 రోజుల్లో దీనికి రూ. 108.50 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 133.50 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.

Prabhas Starrer Adipurush Movie 2 Days Worldwide Official Collections

నాన్ RRR రికార్డు బద్దలు:'ఆదిపురుష్' మూవీకి రెండో రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 15.04 కోట్లు షేర్ వసూలు అయింది. ఫలితంగా ఈ చిత్రం రెండో రోజు అత్యధిక షేర్‌ను రాబట్టిన చిత్రాల్లో రెండో స్థానానికి చేరుకుంది. అదే సమయంలో బాహుబలి 2 పేరిట ఉన్న రూ. 14.80 కోట్లు రికార్డును దాటేసింది. ఇక, ఈ లిస్టులో RRR మూవీ రూ. 31.63 కోట్లతో మొదటి స్థానంలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X