Adipurush 2 Weeks Collections: 242 కోట్లు రావాలి.. 2 వారాల్లో వచ్చింది ఇంతే.. అన్ని కోట్ల నష్టాలా!

పేరుకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకుని పాన్ ఇండియా స్టార్‌గా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ ఉత్సాహంలోనే వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇలా ఇటీవలే ఈ బడా హీరో 'ఆదిపురుష్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు కలెక్షన్లు పెద్దగా రావడం లేదు. దీంతో రెండు వారాల్లో నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ 14 రోజుల రిపోర్టును మీరే చూసేయండి!

రామాయణంతో వచ్చేశారు: ప్రభాస్ హీరోగా తెరకెక్కిన టెక్నికల్ రామాయణమే 'ఆదిపురుష్'. ఓం రౌత్ తీసిన ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్, అతుల్ మ్యూజిక్ అందించారు. ఇందులో ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు.

Prabhas

ఆదిపురుష్ బిజినెస్ ఎంత?:
అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన 'ఆదిపురుష్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ దాదాపు రూ. 130 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 240 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌‌ అయింది.

14వ రోజు తెలుగు వసూళ్లిలా: 'ఆదిపురుష్' మూవీకి 14వ రోజు ఏపీ, తెలంగాణలో వసూళ్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రూ. 51 లక్షలు షేర్, రూ. 95 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

Prabhas

14 రోజుల్లో తెలుగు కలెక్షన్లు: 'ఆదిపురుష్'కు తెలుగులో 2 వారాలకు వసూళ్లు తక్కువే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 36.56 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.92 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 10.50 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.14 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.44 కోట్లు, గుంటూరులో రూ. 6.72 కోట్లు, కృష్ణాలో రూ. 4.56 కోట్లు, నెల్లూరులో రూ. 2.32 కోట్లతో.. రూ. 81.16 కోట్లు షేర్, రూ. 131.05 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: విజువల్ వండర్‌గా వచ్చిన 'ఆదిపురుష్' మూవీకి 14 రోజులకు కలిపి తెలుగులో రూ. 81.16 కోట్లు, తమిళంలో రూ. 2.45 కోట్లు, కర్నాటకలో రూ. 12.37 కోట్లు, కేరళలో రూ. 87 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 69.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 24.73 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 14 రోజుల్లో రూ. 191.42 కోట్లు షేర్, రూ. 455 కోట్లు గ్రాస్ వచ్చింది.

Prabhas

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి: 'ఆదిపురుష్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 240 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 242 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. కానీ, 14 రోజుల్లో దీనికి రూ. 191.42 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. ఇంకా ఇది రూ. 50.58 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సిన అవసరం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X