Adipurush 20 Days Collections: ఆదిపురుష్ ఢమాల్.. 600 కోట్ల సినిమా ఇంత ఘోరమా.. ఏకంగా అన్ని కోట్ల లాస్
పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ఏకధాటిగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా ఇప్పటికే ఎన్నో భారీ చిత్రాలతో వచ్చిన అతడు.. ఇటీవలే 'ఆదిపురుష్' అనే సినిమాతో పలకరించాడు. కానీ, ఈ మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు ఆశించిన స్థాయిలో దక్కడం లేదు. ఫలితంగా ప్రభాస్ సినిమా భారీ నష్టాల దిశగా సాగిపోతోంది. ఇక, 20వ రోజు అయితే దీనికి దారుణమైన రిజల్ట్ వచ్చింది. ఈ నేపథ్యంలో రెబెల్ స్టార్ నటించిన 'ఆదిపురుష్' మూవీ టోటల్ రిపోర్టును మీరే చూడండి మరి!
శ్రీరాముడిగా వచ్చిన ప్రభాస్:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రమే 'ఆదిపురుష్'. ఓం రౌత్ తీసిన ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. ఇందులో ప్రభాస్ రాఘవుడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. అజయ్, అతుల్ సంగీతాన్ని సమకూర్చారు.

ఆదిపురుష్ బిజినెస్ ఎంత?:అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన 'ఆదిపురుష్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ దాదాపు రూ. 200 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 240 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

20వ రోజు తెలుగు వసూళ్లిలా:యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్‌లో రూపొందిన 'ఆదిపురుష్' మూవీకి టాక్‌కు తగ్గట్లుగానే దారుణమైన వసూళ్లు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తేలిపోయింది. దీంతో రెండు, మూడు రోజులుగా వసూళ్లు పేలవంగా దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో 20వ రోజైన బుధవారం ఈ చిత్రం తెలుగులో రూ. 5 లక్షలు షేర్‌నే కలెక్ట్ చేసింది.

20 రోజుల్లో తెలుగు కలెక్షన్లు:'ఆదిపురుష్'కు తెలుగులో 20 రోజులకు వసూళ్లు తక్కువే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 36.93 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.03 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 10.64 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.23 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.51 కోట్లు, గుంటూరులో రూ. 6.80 కోట్లు, కృష్ణాలో రూ. 4.65 కోట్లు, నెల్లూరులో రూ. 2.39 కోట్లతో.. రూ. 82.18 కోట్లు షేర్, రూ. 133.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:హై రేంజ్ విజువల్స్‌తో వచ్చిన 'ఆదిపురుష్' మూవీకి 20 రోజులకు తెలుగులో రూ. 82.18 కోట్లు, తమిళంలో రూ. 2.47 కోట్లు, కర్నాటకలో రూ. 12.45 కోట్లు, కేరళలో రూ. 87 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 70.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 24.81 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 20 రోజుల్లో రూ. 193.03 కోట్లు షేర్, రూ. 458.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి:'ఆదిపురుష్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 240 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 242 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. కానీ, 20 రోజుల్లో దీనికి రూ. 193.03 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. ఇంకా ఇది రూ. 48.97 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications











