Adipurush 6 Days Collections: ప్రభాస్‌కు మరో షాక్.. 6వ రోజే దారుణంగా.. ఆదిపురుష్ హిట్ కొట్టాలంటే!
దాదాపు నెల రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించి.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'ఆదిపురుష్'. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా రామాయణం నేపథ్యంతో రావడంతో ఆరంభంలోనే అందరి దృష్టి దీనిపై పడింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం భారీ స్థాయిలో బిజినెస్ చేసుకుని గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే, దీనికి ఓపెనింగ్స్ బాగానే వచ్చినా.. వర్కింగ్ డేస్‌లో అంతగా రాణించట్లేదు. ఈ క్రమంలోనే ఆరో రోజూ బాగా డౌన్ అయింది. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' 6 రోజుల వసూళ్లను మీరే చూడండి!
హై రేంజ్‌లోనే ఆదిపురుష్:యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రమే 'ఆదిపురుష్'. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్ - అతుల్ దీనికి సంగీతం ఇచ్చారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు.

ఆదిపురుష్ బిజినెస్ ఎంత?:విజువల్ వండర్‌గా రూపొందిన 'ఆదిపురుష్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ దాదాపు రూ. 120 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 240 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ అయింది.
6వ రోజు తెలుగు వసూళ్లిలా:'ఆదిపురుష్' మూవీ 6వ రోజు ఏపీ, తెలంగాణలో భారీగా డౌన్ అయింది. ఫలితంగా నైజాంలో రూ. 65 లక్షలు, సీడెడ్‌లో రూ. 33 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 24 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో.. రూ. 1.72 షేర్, రూ. 3.30 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

6 రోజుల్లో తెలుగు కలెక్షన్లు:'ఆదిపురుష్' తెలుగు రాష్ట్రాల్లో 6 రోజులకు మంచి వసూళ్లు సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 33.87 కోట్లు, సీడెడ్‌లో రూ. 8.89 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 9.52 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.55 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.91 కోట్లు, గుంటూరులో రూ. 6.35 కోట్లు, కృష్ణాలో రూ. 4.14 కోట్లు, నెల్లూరులో రూ. 2.07 కోట్లతో.. రూ. 74.30 కోట్లు షేర్, రూ. 118.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:క్రేజీ కాంబోలో వచ్చిన 'ఆదిపురుష్' మూవీకి 6 రోజులకు కలిపి తెలుగులో రూ. 74.30 కోట్లు, తమిళంలో రూ. 2.26 కోట్లు, కర్నాటకలో రూ. 11.55 కోట్లు, కేరళలో రూ. 80 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 63.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 23.05 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లో రూ. 175.76 కోట్లు షేర్, రూ. 355 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి:'ఆదిపురుష్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 240 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 242 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. కానీ, 6 రోజుల్లో దీనికి రూ. 175.76 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. ఇంకా ఇది రూ. 66.24 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సిన అవసరం ఉంది.

మరీ ఇంత తక్కువగానా?:'ఆదిపురుష్' మూవీకి ఫస్ట్ వీకెండ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే స్పందన వచ్చింది. కానీ, నాలుగో రోజు మాత్రం ఈ చిత్రం అన్ని ఏరియాల్లోనూ తేలిపోయింది. అప్పటి నుంచి క్రమంగా పడిపోతూనే వస్తోంది. ఇలా ఆరో రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 5 కోట్లే రాబట్టింది. ఇదే కంటిన్యూ అయితే ఈ చిత్రానికి నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications











