Adipurush 8 Days Collections: ఆదిపురుష్‌కు మరో దెబ్బ.. 1100 నుంచి 450కి.. అదే జరిగితే సినిమా ఫ్లాపే!
పేరుకు తెలుగు హీరోనే అయినా ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను పెంచుకుని వరుస చిత్రాలతో దూసుకుపోతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. 'బాహుబలి' సిరీస్ తర్వాత అతడు చేసిన సినిమాలు విజయాన్ని అందుకోకున్నా.. మార్కెట్ మాత్రం పెంచుకుంటూనే ఉన్నాడు.
ఈ క్రమంలోనే గత వారంలోనే ప్రభాస్ 'ఆదిపురుష్' అనే మూవీతో వచ్చాడు. దీనికి ఓపెనింగ్స్ బాగానే వచ్చినా.. తర్వాత మాత్రం కలెక్షన్లు పడిపోతూనే ఉన్నాయి. ఇక, 2వ వారంలో దీనికి మరో షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' మూవీ ఎనిమిది రోజుల వసూళ్లను మీరే చూడండి!

రాఘవుడిగా వచ్చిన ప్రభాస్: తెలుగు స్టార్ హీరో ప్రభాస్ - బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో వచ్చిన చిత్రమే 'ఆదిపురుష్'. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్, అతుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా నటించారు.

ఆదిపురుష్ బిజినెస్ ఎంత?: హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో వచ్చిన 'ఆదిపురుష్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ దాదాపు రూ. 120 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 240 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ అయింది.

8వ రోజు తెలుగు వసూళ్లిలా: 'ఆదిపురుష్' మూవీ 8వ రోజు ఏపీ, తెలంగాణలో భారీగా డౌన్ అయింది. ఫలితంగా నైజాంలో రూ. 24 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రూ. 65 లక్షలు షేర్, రూ. 1.20 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

8 రోజుల్లో తెలుగు కలెక్షన్లు: 'ఆదిపురుష్' తెలుగు రాష్ట్రాల్లో 8 రోజులకు తక్కువ వసూళ్లే సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 34.49 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 9.76 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.72 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.06 కోట్లు, గుంటూరులో రూ. 6.43 కోట్లు, కృష్ణాలో రూ. 4.21 కోట్లు, నెల్లూరులో రూ. 2.12 కోట్లతో.. రూ. 75.92 కోట్లు షేర్, రూ. 121.55 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: భారీ బడ్జెట్‌తో రూపొందిన 'ఆదిపురుష్' మూవీకి 8 రోజులకు కలిపి తెలుగులో రూ. 75.92 కోట్లు, తమిళంలో రూ. 2.34 కోట్లు, కర్నాటకలో రూ. 11.82 కోట్లు, కేరళలో రూ. 84 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 65.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 23.60 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లో రూ. 179.87 కోట్లు షేర్, రూ. 363.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి: 'ఆదిపురుష్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 240 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 242 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. కానీ, 8 రోజుల్లో దీనికి రూ. 179.87 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. ఇంకా ఇది రూ. 62.13 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సిన అవసరం ఉంది.

1100 నుంచి 450కి అవగా: 'ఆదిపురుష్' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏకంగా 1100 థియేటర్లు లభించాయి. కానీ, రెండో వారంలో మాత్రం ఈ చిత్రం కేవలం 450 థియేటర్లకే పరిమితం అయింది. దీంతో ఈ చిత్రానికి తెలుగులో మరింత కలెక్షన్లు డౌన్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక, ఈ చిత్రం రన్ ఇలాగే కొనసాగితే డిజాస్టర్‌గా నిలవడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











