Adipurush 9 Days Collections: శనివారం షాకింగ్ కలెక్షన్లు.. 60 కోట్లంటే కష్టమే.. ఇలా అయితే ఎలా సామీ!
దాదాపు రెండు నెలల పాటు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సినిమాల్లో 'ఆదిపురుష్' ఒకటి. ఆ రేంజ్‌లో ఈ మూవీ విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా అత్యంత భారీ బిజినెస్‌ను జరుపుకుని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
కానీ, ఈ చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం భారీగానే వచ్చాయి. అయితే, ఆ తర్వాత నుంచి కలెక్షన్లు డౌన్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శనివారం కూడా పెద్దగా రాణించలేదు. మరి 'ఆదిపురుష్' మూవీ 9 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

హై రేంజ్‌లోనే ఆదిపురుష్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన చిత్రమే 'ఆదిపురుష్'. ఓం రౌత్ తీసిన ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్, అతుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు.

ఆదిపురుష్ బిజినెస్ ఎంత?: అత్యంత భారీ బడ్జెట్‌తో వచ్చిన 'ఆదిపురుష్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ దాదాపు రూ. 120 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 240 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

9వ రోజు తెలుగు వసూళ్లిలా: 9వ రోజు 'ఆదిపురుష్' మూవీ ఏపీ, తెలంగాణలో వసూళ్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 39 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. రూ. 1.08 కోట్లు షేర్, రూ. 2.05 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

9 రోజుల్లో తెలుగు కలెక్షన్లు: 'ఆదిపురుష్' తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులకు వసూళ్లు పర్వాలేదనిపించాయి. ఫలితంగా నైజాంలో రూ. 34.88 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.27 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 9.90 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.83 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.16 కోట్లు, గుంటూరులో రూ. 6.51 కోట్లు, కృష్ణాలో రూ. 4.29 కోట్లు, నెల్లూరులో రూ. 2.16 కోట్లతో.. రూ. 77.00 కోట్లు షేర్, రూ. 123.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: హై రేంజ్‌లో వచ్చిన 'ఆదిపురుష్' మూవీకి 9 రోజులకు కలిపి తెలుగులో రూ. 77.00 కోట్లు, తమిళంలో రూ. 2.36 కోట్లు, కర్నాటకలో రూ. 11.96 కోట్లు, కేరళలో రూ. 85 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 66.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 23.95 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల్లో రూ. 182.52 కోట్లు షేర్, రూ. 369.10 కోట్లు గ్రాస్ వచ్చింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి: 'ఆదిపురుష్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 240 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 242 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. కానీ, 9 రోజుల్లో దీనికి రూ. 182.52 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. ఇంకా ఇది రూ. 59.48 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సిన అవసరం ఉంది.

పెరిగాయి.. కానీ కష్టంగానే: 'ఆదిపురుష్' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 9వ రోజైన శనివారం కలెక్షన్లు భారీగా పెరిగాయి. దీంతో ఈ చిత్రం రూ. 1 కోటి మార్కును కూడా దాటింది. కానీ, ప్రపంచ వ్యాప్తంగా మాత్రం ఈ చిత్రం అంతగా రాణించలేదు. దీంతో విజయం సాధించడానికి ఇంకా రూ. 59 కోట్లకు పైగానే వసూలు చేయాల్సి ఉంది. కాబట్టి ఇది హిట్ స్టేటస్‌ను అందుకోవడం కష్టమే అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











