Adipurush Total Collections: ఆదిపురుష్ ఢమాల్.. ఏకంగా అన్ని కోట్ల నష్టం.. ప్రభాస్ పరమ చెత్త రికార్డు

సాధారణంగా ఇండియాలోని అన్ని ఇండస్ట్రీల నుంచి ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే భారీ స్థాయిలో బజ్‌ను ఏర్పరచుకుని అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటాయి. అలాంటి వాటిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'ఆదిపురుష్' ఒకటి. పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల స్పందనను అందుకోలేదు. ఫలితంగా భారీ నష్టాలతోనే ఫుల్ రన్‌ను ముగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' మూవీ టోటల్ కలెక్షన్ల రిపోర్టును మీరే చూడండి మరి!

భారీ బడ్జెట్‌తో వచ్చిన మూవీ : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రమే 'ఆదిపురుష్'. ఓం రౌత్ తీసిన ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్, అతుల్ సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో ప్రభాస్ రాఘవుడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు.

adipurush1

ఆదిపురుష్ బిజినెస్ ఎంత : టై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందిన 'ఆదిపురుష్' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ దాదాపు రూ. 200 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 240 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ అయింది.

adipurush1

అలాంటి టాక్‌తో తక్కువగా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్‌లో రూపొందిన 'ఆదిపురుష్' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లే దీనికి దారుణమైన వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం నిరాశ పరిచింది. వేరే భాషల్లో సైతం ఇది పెద్దగా రాణించలేదు. ఫలితంగా 'ఆదిపురుష్' మూవీ నష్టాలతోనే రన్‌ను కంప్లీట్ చేసుకుంది.

adipurush1

ఆదిపురుష్ తెలుగు కలెక్షన్లు : 'ఆదిపురుష్'కు తెలుగులో ఫుల్ రన్‌లో వసూళ్లు తక్కువే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 36.96 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.04 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 10.65 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.22 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.51 కోట్లు, గుంటూరులో రూ. 6.80 కోట్లు, కృష్ణాలో రూ. 4.65 కోట్లు, నెల్లూరులో రూ. 2.39 కోట్లతో.. రూ. 82.22 కోట్లు షేర్, రూ. 133.12 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

adipurush1

ప్రపంచ వ్యాప్తంగా ఎంత : భారీ బడ్జెట్‌తో రూపొందిన 'ఆదిపురుష్' మూవీకి ఫుల్ రన్‌లో తెలుగులో రూ. 82.22 కోట్లు, తమిళంలో రూ. 2.47 కోట్లు, కర్నాటకలో రూ. 12.46 కోట్లు, కేరళలో రూ. 87 లక్షలు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 70.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 24.80 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 20 రోజుల్లో రూ. 193.07 కోట్లు షేర్, రూ. 459 కోట్లు గ్రాస్ వచ్చింది.

adipurush1

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి : 'ఆదిపురుష్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 240 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 242 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. కానీ, ఫుల్ రన్‌లో దీనికి రూ. 193.07 కోట్లు షేర్ వచ్చింది. అంటే.. ఈ చిత్రం ఏకంగా రూ. 48.93 కోట్లు నష్టాలతో రన్‌ను ముగించాల్సి వచ్చింది.

ప్రభాస్ ఖాతాలో చెత్త రికార్డు : ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీ దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ రన్ ముగిసింది. దీంతో ఈ చిత్రం రూ. 48.93 కోట్లు నష్టాలను ఎదుర్కొంది. దీంతో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ల జాబితాలో ఇది 8వ స్థానానికి చేరింది. ఈ లిస్టులో 'రాధే శ్యామ్' టాప్‌లో ఉండగా.. 'సాహో' 7వ స్థానంలో ఉంది. దీంతో టాప్ 10లో డిజాస్టర్లో మూడింటితో ప్రభాస్ చెత్త రికార్డు సాధించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X