Adipurush Day 1 Collections: చరిత్ర సృష్టించిన ప్రభాస్.. ఆదిపురుష్‌కు ఒక్కరోజే అన్ని కోట్లా!
కొద్ది రోజులుగా ఇండియా వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోన్న చిత్రాల్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'ఆదిపురుష్' ఒకటి. అంతలా ఈ మూవీ ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో అంతటా ఈ మూవీ మేనియానే కనిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు 'ఆదిపురుష్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్లలో విడుదల అవుతుంది? అనే దానిపై ఓ లుక్కేద్దాం పదండి!
రామాయణం తీసుకొచ్చారు:ప్రభాస్ హీరోగా ఓం రౌత్ రూపొందించిన హై రేంజ్ బడ్జెట్ చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో అతడు రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్ - అతుల్ దీనికి సంగీతాన్ని ఇచ్చారు.

ఆదిపురుష్ బిజినెస్ ఇలా:రామాయణం బ్యాగ్‌డ్రాప్‌తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన 'ఆదిపురుష్' మూవీ అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 120 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 240 కోట్ల మేర బిజినెస్ అయింది.
అలాంటి టాక్.. భారీగానే:ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే అంతగా రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. దీంతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఓపెనింగ్ డేన అత్యధిక కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అందుకు తగ్గట్లే ఫస్ట్ డేనే భారీ స్థాయిలో వసూళ్లు దక్కాయి.

ఫస్ట్ డే తెలుగు వసూళ్లు ఇలా:హై రేంజ్‌లో వచ్చిన 'ఆదిపురుష్' మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. దీంతో నైజాంలో రూ. 13.68 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.52 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.72 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.78 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.24 కోట్లు, గుంటూరులో రూ. 4.00 కోట్లు, కృష్ణాలో రూ. 2.00 కోట్లు, నెల్లూరులో రూ. 90 లక్షలతో కలిపి.. రూ. 32.84 కోట్లు షేర్, రూ. 50.90 కోట్లు గ్రాస్ వచ్చింది.
తెలుగులో హిట్ అవ్వాలంటే:అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన 'ఆదిపురుష్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లోని హక్కులకు భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమా రైట్స్‌ను అత్యధిక ధరలకు అమ్ముకున్నారు. ఇలా ఈ సినిమా రూ. 120 కోట్లు బిజినెస్ చేసింది. దీంతో తెలుగులో ఇది హిట్ అవ్వాలంటే రూ. 121 కోట్లు షేర్ రాబట్టాలి. అంటే ఇంకా రూ. 88.16 కోట్లు వసూలు చేస్తేనే విజయం సాధించింది.

నైజాంలో రెండో స్థానంలో:మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే నైజాం ఏరియాలో చాలా పెద్ద సినిమా మార్కెట్ ఉంది. దీంతో పెద్ద సినిమాలకు ఇక్కడే ఎక్కువ కలెక్షన్లు వస్తుంటాయి. ఈ ప్రాంతంలో RRR మొదటి రోజు రూ. 23.35 కోట్లు షేర్ రాబట్టి టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఇప్పుడు 'ఆదిపురుష్' రూ. 13.68 కోట్లతో రెండో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలోనే సర్కారు వారి పాటను వెనక్కి నెట్టేసింది.

ఓవరాల్‌గా ఆరో స్థానంలో:ఇక, మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్‌ను రాబట్టిన చిత్రాల జాబితాలో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీ ఏకంగా ఆరో స్థానానికి చేరుకుంది. ఈ లిస్టులో RRR రూ. 74.11 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత వరుసగా బాహుబలి 2 (రూ. 43 కోట్లు), సైరా (రూ. 38.75 కోట్లు), సాహో (రూ. 36.52 కోట్లు), సర్కారు వారి పాట (రూ. 36.01 కోట్లు) ఉన్నాయి.


Click it and Unblock the Notifications











