Adipurush Business: ప్రభాస్ మూవీకి సంచలన బిజినెస్.. అన్ని వందల కోట్లా.. ఆదిపురుష్ హిట్ అవ్వాలంటే!
సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో తనదైన రీతిలో హవాను చూపించి.. కొన్నేళ్లుగా నేషనల్ వైడ్‌గా దండయాత్ర చేస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే పలు పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అతడు.. ఇప్పుడు 'ఆదిపురుష్' అనే మైథాలజీ మూవీతో రాబోతున్నాడు. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడడంతో రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. మరి ఇది ఎంత మేర వ్యాపారం చేసుకుందో చూద్దాం పదండి!
శ్రీరాముడిగా మారిన ప్రభాస్:యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో రూపొందిన చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో అతడు రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్ - అతుల్ దీనికి మ్యూజిక్ అందించారు.

విజువల్ వండర్‌గా వస్తుంది:రామాయణం నేపథ్యంతో చెడు మీద మంచి ఎలా గెలిచింది అనే కాన్సెప్టుతో 'ఆదిపురుష్' మూవీ తెరకెక్కింది. ముఖ్యంగా ఇందులో అరణ్యకాండ, యుద్ధకాండలను ప్రధానంగా తీసుకున్నారు. వీటికి హై రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్‌ను జోడించి తీశారు. ఇక, ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో విడుదల కాబోతుంది. దీంతో ఈ మూవీ హవానే కనిపిస్తోంది.

గ్రాండ్‌గా రిలీజ్.. ప్రమోషన్స్:పౌరాణిక నేపథ్యంతో రాబోతున్న 'ఆదిపురుష్' మూవీని జూన్ 16వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అన్ని రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేస్తోంది. మరోవైపు, ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో ప్రాంతాల్లో టికెట్లు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అన్ని ఏరియాల్లోనూ దీనికి అదిరిపోయే స్పందన వస్తోంది.

అన్ని భాషల్లో భారీ డిమాండ్:క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఆదిపురుష్' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ దక్కుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.
ఆంధ్రా, తెలంగాణ బిజినెస్:'ఆదిపురుష్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 50 కోట్లు, సీడెడ్‌లో రూ. 17.60 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 14.50 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 8.80 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7.20 కోట్లు, గుంటూరులో రూ. 8.60 కోట్లు, కృష్ణాలో రూ. 8.50 కోట్లు, నెల్లూరులో రూ. 4.80 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన 'ఆదిపురుష్' మూవీకి దేశ వ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ వచ్చింది. దీంతో ఈ సినిమా కర్నాటకలో రూ. 16.50 కోట్లు, తమిళనాడులో రూ. 5 కోట్లు, హిందీ ప్లస్ నార్త్ ఇండియా మొత్తంలో రూ. 75 కోట్లు, కేరళలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 21.50 కోట్లు బిజినెస్ చేసింది. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 240 కోట్లు వ్యాపారం జరిగింది.

అన్ని కోట్ల టార్గెట్.. రికార్డు:'ఆదిపురుష్' సినిమాకు రూ. 240 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో రూ. 242 కోట్లు షేర్ వసూలు అయితేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉండగా.. టాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక బిజినెస్ చేసుకున్న చిత్రాల జాబితాలో ఇది నాలుగో స్థానానికి చేరింది. అంతేకాదు, హయ్యెస్ట్ బిజినెస్ చేసిన టాప్ 5 చిత్రాల్లో నాలుగు ప్రభాస్‌వే ఉండడం విశేషం.


Click it and Unblock the Notifications











