Adipurush: అన్ని వేల థియేటర్లలో ఆదిపురుష్.. ప్రభాస్ మరో రికార్డు.. 5లో నాలుగు రెబెల్ స్టార్‌వే!

కొద్ది రోజులుగా ఇండియా వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోన్న చిత్రాల్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'ఆదిపురుష్' ఒకటి. అంతలా ఈ మూవీ ప్రభావాన్ని చూపిస్తోంది. దీంతో అంతటా ఈ మూవీ మేనియానే కనిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు 'ఆదిపురుష్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్లలో విడుదల అవుతుంది? అనే దానిపై ఓ లుక్కేద్దాం పదండి!

శ్రీరాముడిగా వస్తున్న ప్రభాస్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో తెరకెక్కిన చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో అతడు రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్ - అతుల్ దీనికి సంగీతాన్ని ఇచ్చారు.

Prabhas Starrer Adipurush Movie Worldwide Theaters Count Details

భారీ అంచనాలతో వస్తుంది: 'ఆదిపురుష్' మూవీపై ఆరంభం నుంచే ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది వచ్చినా భారీ స్పందనను అందుకుంది. దీంతో ఈ సినిమా పేరిట ఎన్నో రికార్డులు సైతం క్రియేట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

Prabhas Starrer Adipurush Movie Worldwide Theaters Count Details

అన్ని వందల కోట్ల బిజినెస్: రామాయణం నేపథ్యంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన 'ఆదిపురుష్' మూవీ అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 120 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 240 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

Prabhas Starrer Adipurush Movie Worldwide Theaters Count Details

ఆదిపురుష్ థియేటర్ల కౌంట్: ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసుకున్న 'ఆదిపురుష్' మూవీ ఊహించని రీతిలో బిజినెస్‌ను జరుపుకుంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రం అంతగా అత్యధిక లొకేషన్లలో విడుదల కాబోతుంది. ముఖ్యంగా 'ఆదిపురుష్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 1100 వందలకు పైగా థియేటర్లలో రిలీజ్ అవుతున్నట్లు ట్రేడ్ వర్గాలు తాజాగా సమాచారం అందించాయి.

Prabhas Starrer Adipurush Movie Worldwide Theaters Count Details

మిగిలిన భాషల్లో థియేటర్లిలా: 'ఆదిపురుష్' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక, దీన్ని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1100 థియేటర్లలో, తమిళనాడులో 170, కర్నాటకలో 180, కేరళలో 150, హిందీ ప్లస్ రెస్టాప్ ఇండియాలో 3300, ఓవర్సీస్‌లో 2100 థియేటర్లలో తీసుకు వస్తున్నారు. మొత్తంగా 7000 థియేటర్లలో రాబోతుంది.

Prabhas Starrer Adipurush Movie Worldwide Theaters Count Details

ప్రభాస్‌కు ఎన్నో రికార్డులు: ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఆదిపురుష్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా 7000కి పైగా థియేటర్లలో విడుదల కాబోతుంది. దీంతో అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతున్న తెలుగు హీరోల చిత్రాల లిస్టులో ఇది 5వ స్థానానికి చేరింది. ఇందులో RRR 10200 థియేటర్లలో టాప్‌లో ఉంది. అలాగే, టాప్ 5లో ప్రభాస్ నటించిన నాలుగు సినిమాలు ఉండడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X