Kalki 2898 AD 10 Days Collection: వందల కోట్లు ఔట్.. రికార్డులు చెల్లాచెదురు.. ప్రభాస్ లాభం ఎంతంటే!
రెబెల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ బడా హీరో సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో.. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా రేంజ్‌లో హవాను చూపిస్తున్నాడు. ముఖ్యంగా 'బాహుబలి' తర్వాత భారీ చిత్రాలనే చేస్తున్నాడు. ఇలా ఇటీవలే ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' అనే సినిమాను చేశాడు. టైం ట్రావెల్ కథతో రూపొందిన ఈ సినిమాకు ఆరంభం నుంచే అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇది అత్యధికంగా వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో 'కల్కి 2898 ఏడీ' 10 రోజుల కలెక్షన్లపై మీరే ఓ లుక్కేయండి మరి!
కల్కిగా మారిన ప్రభాస్
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన టెక్నికల్ వండర్ మూవీనే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ భారీ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రల్లో నటించారు.

కల్కి బిజినెస్ ఎంతంటే
ప్రభాస్ హీరోగా చేసిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి రూ. 370 కోట్లు బిజినెస్ అయింది.

10వ రోజు ఫుల్లు వసూళ్లు
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు పదో రోజు రెస్పాన్స్ మరింతగా పెరిగిపోయింది. ఫలితంగా ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 6 కోట్లు వరకూ షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 20 కోట్లు వసూలు చేసింది. ఇలా 10 రోజుల్లోనే రూ. 390 కోట్లు షేర్‌తో పాటు రూ. 850 కోట్లు గ్రాస్ రాబట్టింది.


Click it and Unblock the Notifications











