Kalki 2898 AD 12 Days Collection: ప్రభాస్ ఊచకోత.. అన్ని కోట్లు ఫినీష్.. లాభం ఎన్ని కోట్లో తెలిస్తే షాకే!
తెలుగు సినిమా స్థాయిని భారీగా పెంచిన హీరోల్లో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలకే పరిమితం అయిన అతడు.. ఈ మధ్య కాలంలో హై రేంజ్ సినిమాలనే చేస్తున్నాడు. అందుకు అనుగుణంగానే మార్కెట్‌ను పెంచుకుంటున్నాడు. ఇలా ఇప్పుడు ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ ఊహించని విధంగా లభిస్తోంది. అందుకు తగ్గట్లుగానే కలెక్షన్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో 'కల్కి 2898 ఏడీ' 12 రోజుల కలెక్షన్లపై మీరే ఓ లుక్కేయండి మరి!
కల్కిగా ప్రభాస్ అరాచకం
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన హాలీవుడ్ రేంజ్ మూవీనే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ భారీ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రలను చేశారు.

కల్కి బిజినెస్ ఎంతంటే
బడా స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి రూ. 370 కోట్లు బిజినెస్ జరిగింది.
12 రోజుల్లో ఎంత అంటే
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు రెస్పాన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. 12వ రోజు కూడా ఇది మంచి ప్రదర్శనే చేసింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 3 కోట్లు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలిపి రూ. 9 కోట్లు రాబట్టింది. ఇలా 12 రోజుల్లోనే ఈ సినిమా రూ. 444 కోట్ల షేర్‌తో రికార్డులు బ్రేక్ చేసింది.


Click it and Unblock the Notifications











