Kalki 2898 AD 14 Days Collection: 372 కోట్లు రావాలి.. 2 వారాల్లో వందల కోట్లు.. ప్రభాస్‌కు లాభం ఎంతంటే!

రెబెల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరు ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా పెద్ద సంచలనం. అంతలా ఇతగాడు సుదీర్ఘ కాలంగా తనదైన హవాను చూపిస్తూ పాన్ ఇండియా స్టార్‌గా దూసుకుపోతోన్నాడు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అదిరిపోయే చిత్రాలతో వస్తున్నాడు. ఇలా ఇటీవలే ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సినిమాను చేశాడు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ కూడా ఊహించని విధంగా లభిస్తోంది. అందుకు తగ్గట్లుగానే భారీ కలెక్షన్లను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో 'కల్కి 2898 ఏడీ' 14 రోజుల వసూళ్లపై మీరే ఓ లుక్కేయండి మరి!

కల్కిగా కనిపించిన స్టార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన క్రేజీ మూవీనే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ భారీ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రల్లో నటించారు.

Prabhas Starrer Kalki 2898 AD Movie 14 Days Worldwide Box Office Collections

ప్రభాస్ బిజినెస్ ఇలా
ప్రభాస్ హీరోగా చేసిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి రూ. 370 కోట్లు బిజినెస్ అయింది.

14వ రోజు తెలుగు కలెక్షన్లు
'కల్కి 2898 ఏడీ' 14వ రోజూ తెలుగులో వసూళ్లు డౌన్ అయ్యాయి. ఫలితంగా నైజాంలో రూ. 47 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 15 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. రూ. 97 లక్షలు షేర్, రూ. 1.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Prabhas Starrer Kalki 2898 AD Movie 14 Days Worldwide Box Office Collections

14 రోజుల్లో తెలుగు కలెక్షన్లు
14 రోజుల్లో 'కల్కి 2898 ఏడీ' తెలుగులో భారీ వసూళ్లు రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 82.83 కోట్లు, సీడెడ్‌లో రూ. 19.08 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 19.51 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 11.33 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.46 కోట్లు, గుంటూరులో రూ. 10.13 కోట్లు, కృష్ణాలో రూ. 10.27 కోట్లు, నెల్లూరులో రూ. 5.46 కోట్లతో.. రూ. 167.07 కోట్లు షేర్, రూ. 259.05 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 14 రోజుల్లో తెలుగులో రూ. 167.07 కోట్లు, తమిళంలో రూ. 19.45 కోట్లు, కర్నాటకలో రూ. 30.60 కోట్లు, కేరళలో రూ. 10.30 కోట్లు, హిందీలో రూ. 117.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 111.15 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 456.32 కోట్లు షేర్, రూ. 940 కోట్లు గ్రాస్ వచ్చింది.

Prabhas Starrer Kalki 2898 AD Movie 14 Days Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. లాభమెంత
'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 370 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 372 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 14 రోజుల్లో దీనికి రూ. 456.32 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 84.32 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X