Kalki 2898 AD 2 Days Collection: 2వ రోజు ఊహించని విధంగా.. ప్రభాస్ డబుల్ సెంచరీ.. ఆ రికార్డులన్నీ బ్రేక్

తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వచ్చే చిత్రాలకు దేశ వ్యాప్తంగా హైప్ క్రియేట్ అవుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొన్ని మూవీలు అయితే సంచలనంగా మారుతున్నాయి. అలాంటి వాటిలో 'కల్కి 2898 ఏడీ' ఒకటి. రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపించింది. ఫలితంగా గ్రాండ్‌గా విడుదలై భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇలా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ తర్వాత రెండో రోజు కూడా ఈ చిత్రం రాణించింది. మరి 'కల్కి 2898 ఏడీ' 2 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి!

కల్కిగా ప్రభాస్ వచ్చాడు
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన హై రేంజ్ సినిమానే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు ఇందులో నటించారు.

Prabhas Starrer Kalki 2898 AD Movie 2 Days Worldwide Box Office Collections

కల్కి బిజినెస్ ఎంతంటే
ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలుపుకుని రూ. 370 కోట్లు వ్యాపారం అయింది.

Prabhas Starrer Kalki 2898 AD Movie 2 Days Worldwide Box Office Collections

2వ రోజుల్లో ఎంతొచ్చింది
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా 2 రోజు కూడా బాగానే హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. ఫలితంగా శుక్రవారం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్లు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 40 కోట్లు రాబట్టింది. ఇలా 2 రోజుల్లో దాదాపు రూ. 134 కోట్లు షేర్‌తో పాటు రూ. 260 కోట్లు గ్రాస్‌ను ఇది వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X