Kalki 2898 AD 3 Days Collection: ప్రభాస్ మాస్ బ్యాటింగ్.. కల్కి రికార్డు వసూళ్లు.. అన్ని వందల కోట్ల ఔట్
ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోన్న చిత్రాల్లో తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చినవే ఉంటున్నాయి. ఇప్పటికే అలా వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' ఒకటి. పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో ఇటీవలే విడుదలైంది. దీనికి మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా భారీ స్థాయిలో లభిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే మూడో రోజు ఇది కుమ్మేసింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' 3 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి!
ప్రభాస్ నుంచి ప్రయోగం
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రయోగాత్మక చిత్రమే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రలు చేశారు.

కల్కి బిజినెస్ ఎంతంటే
ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి రూ. 370 కోట్లు వ్యాపారం జరిగింది.
3వ రోజు ఇలా.. టోటల్‌గా
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. శనివారం వరల్డ్ కప్ ఫైనల్ ఉన్నా ఇది సత్తా చాటింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 20 కోట్లు వరకూ షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 55 కోట్లు వరకూ రాబట్టింది. ఇలా 3 రోజుల్లోనే రూ. 200 కోట్లు షేర్‌తో రికార్డు సాధించింది.


Click it and Unblock the Notifications











