Kalki 2898 AD 30 Days Collection: కల్కి వందల కోట్ల సునామీ.. లాభాలతోనే ప్రభాస్ సెన్సేషనల్ రికార్డు
కొంత కాలంగా టాలీవుడ్ నుంచి వచ్చిన చిత్రాలు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతున్నాయి. దీంతో విడుదలైన అన్ని భాషల్లోనూ సత్తా చాటుతూ విజయాలను అందుకుంటున్నాయి. అలాంటి సినిమాల్లో 'కల్కి 2898 ఏడీ' చిత్రం ఒకటి. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ.. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలోనే లభించింది. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' 30 రోజుల వసూళ్లపై మీరే ఓ లుక్కేయండి!
కల్కిగా వచ్చేసిన ప్రభాస్
టాలీవుడ్ బడా హీరో ప్రభాస్ నటించిన భారీ సినిమానే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ భారీ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రలను పోషించారు.

ప్రభాస్ బిజినెస్ ఎంతంటే
రెబెల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి రూ. 370 కోట్లు బిజినెస్ అయింది.
30వ రోజు తెలుగు కలెక్షన్లు
క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపకల్పనలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి ఐదో వారంలోనూ అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా 30వ రోజు ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రేక్షకుల స్పందన మరింతగా పెరిగిపోయింది. ఫలితంగా ఈ చిత్రం శుక్రవారం రూ. 33 లక్షలు షేర్‌తో పాటు రూ. 60 లక్షలు గ్రాస్ రాబట్టింది.

30 రోజుల్లో తెలుగు కలెక్షన్లు
'కల్కి 2898 ఏడీ' 30 రోజుల్లో తెలుగులో భారీ వసూళ్లు రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 90.86 కోట్లు, సీడెడ్‌లో రూ. 21.17 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 21.38 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 12.27 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 9.26 కోట్లు, గుంటూరులో రూ. 11.03 కోట్లు, కృష్ణాలో రూ. 11.05 కోట్లు, నెల్లూరులో రూ. 6.02 కోట్లతో.. రూ. 183.04 కోట్లు షేర్, రూ. 287.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 30 రోజుల్లో తెలుగులో రూ. 183.04 కోట్లు, తమిళంలో రూ. 21.67 కోట్లు, కర్నాటకలో రూ. 35.65 కోట్లు, కేరళలో రూ. 12.80 కోట్లు, హిందీలో రూ. 143.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 128.95 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 525.76 కోట్లు షేర్, రూ. 1102 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. లాభమెంత
'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 370 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 372 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 30 రోజుల్లో దీనికి రూ. 525.76 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 153.76 కోట్లు లాభాలతో రికార్డు నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











