Kalki 2898 AD 31 Days Collection: 31వ రోజు పెను సంచలనం.. వందల కోట్లతో రికార్డు.. ప్రభాస్ లాభం ఎంతంటే!
తెలుగు సినిమా రేంజ్ పెరగడంతో ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్టులతో భారీ భారీ చిత్రాలు వస్తున్నాయి. వాటికి ప్రేక్షకులు మంచి స్పందన అందిస్తుండడంతో అదే తరహాలో ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా టైం ట్రావెల్ స్టోరీతో రూపొందిన హాలీవుడ్ రేంజ్ సినిమానే 'కల్కి 2898 ఏడీ'. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో వచ్చి భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఫలితంగా దీనికి వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'కల్కి 2898 ఏడీ' 31 రోజుల వసూళ్లపై మీరే ఓ లుక్కేయండి మరి!
కల్కిగా ప్రభాస్ విశ్వరూపం
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన విజువల్ వండర్ మూవీనే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ భారీ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రలల్లో నటించారు.

ప్రభాస్ బిజినెస్ ఎంతంటే
ప్రభాస్ హీరోగా చేసిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి రూ. 370 కోట్లు బిజినెస్ జరిగింది.

31వ రోజు తెలుగు కలెక్షన్లు
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ చేసిన 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి నెల రోజులు దాటినా రెస్పాన్స్ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా 31వ రోజు ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రేక్షకుల స్పందన రెట్టింపు అయిపోయింది. ఫలితంగా ఈ చిత్రం శనివారం రూ. 61 లక్షలు షేర్‌తో పాటు రూ. 1.10 కోట్లు గ్రాస్ రాబట్టింది.

31 రోజుల్లో తెలుగు కలెక్షన్లు
31 రోజుల్లో 'కల్కి 2898 ఏడీ' తెలుగులో భారీ వసూళ్లు రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 91.16 కోట్లు, సీడెడ్‌లో రూ. 21.25 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 21.46 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 12.30 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 9.30 కోట్లు, గుంటూరులో రూ. 11.06 కోట్లు, కృష్ణాలో రూ. 11.08 కోట్లు, నెల్లూరులో రూ. 6.04 కోట్లతో.. రూ. 183.65 కోట్లు షేర్, రూ. 288.65 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ దూసుకెళ్తూనే ఉంది. దీనికి 31 రోజుల్లో తెలుగులో రూ. 183.65 కోట్లు, తమిళంలో రూ. 21.70 కోట్లు, కర్నాటకలో రూ. 35.85 కోట్లు, కేరళలో రూ. 12.82 కోట్లు, హిందీలో రూ. 144.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 129.15 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 527.72 కోట్లు షేర్, రూ. 1106 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. లాభమెంత
'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 370 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 372 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 31 రోజుల్లో దీనికి రూ. 527.72 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 155.72 కోట్లు లాభాలతో రికార్డు నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











