Kalki 2898 AD 35 Days Collection: 372 కోట్లు రావాలి.. 5 వారాల్లో వందల కోట్లు.. లాభంతో ప్రభాస్ రికార్డు
తెలుగు సినిమా రంగంలో ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. అందులో ఎక్కువ శాతం రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నవే ఉంటున్నాయి. ఈ బడా హీరో ఇప్పటికే చాలా చిత్రాలతో వచ్చి అలరించాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ పాన్ ఇండియా హీరో 'కల్కి 2898 ఏడీ' అనే సినిమాలో నటించాడు. టెక్నికల్ వండర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి ఆరంభం నుంచీ భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం రికార్డు వసూళ్లతో సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో 'కల్కి 2898 ఏడీ' 5 వారాల వసూళ్లపై మీరే ఓ లుక్కేయండి మరి!
కల్కితో వచ్చేసిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ సినిమానే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ భారీ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రలు పోషించారు.

ప్రభాస్ బిజినెస్ ఎంతంటే
ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి రూ. 370 కోట్లు బిజినెస్ అయింది.
35వ రోజు తెలుగు కలెక్షన్లు
క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కలిసి ప్రభాస్ చేసిన 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి నెల రోజులు దాటినా ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం బాగానే లభిస్తోంది. ముఖ్యంగా 35వ రోజు ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రేక్షకుల రెస్పాన్స్ మంచిగానే దక్కింది. ఫలితంగా ఈ చిత్రం మంగళవారం రూ. 20 లక్షలు షేర్‌తో పాటు రూ. 40 లక్షలు గ్రాస్ రాబట్టింది.

35 రోజుల్లో తెలుగు కలెక్షన్లు
'కల్కి 2898 ఏడీ' 35 రోజుల్లో తెలుగులో భారీ వసూళ్లు రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 91.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 21.47 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 21.60 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 12.38 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 9.41 కోట్లు, గుంటూరులో రూ. 11.14 కోట్లు, కృష్ణాలో రూ. 11.15 కోట్లు, నెల్లూరులో రూ. 6.10 కోట్లతో.. రూ. 185.10 కోట్లు షేర్, రూ. 291.55 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుతోంది. దీనికి 35 రోజుల్లో తెలుగులో రూ. 185.10 కోట్లు, తమిళంలో రూ. 21.81 కోట్లు, కర్నాటకలో రూ. 36.23 కోట్లు, కేరళలో రూ. 12.92 కోట్లు, హిందీలో రూ. 146.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 129.90 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 532.46 కోట్లు షేర్, రూ. 1108 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. లాభమెంత
'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 370 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 372 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది 35 రోజుల్లో దీనికి రూ. 532.46 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 160.46 కోట్లు లాభాలతో రికార్డులు బద్దలు కొట్టేసింది.


Click it and Unblock the Notifications











