Kalki 2898 AD 5 Days Collection: ఆగని కల్కి ఊచకోత.. 5 రోజుల్లో వందల కోట్లు.. హిట్ కొట్టాలంటే మాత్రం!
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ.. ఈ మధ్య కాలంలో మాత్రం భారీ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌లో సందడి చేస్తున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ముఖ్యంగా 'బాహుబలి' తర్వాత నుంచి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ బడా హీరో 'కల్కి 2898 ఏడీ' అనే సినిమాను చేశాడు. పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది. దీనికి మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కల్కి 2898 ఏడీ' 5 రోజుల కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి!
కల్కిగా ప్రభాస్ అరాచకం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన క్రేజీ కాన్సెప్ట్ మూవీనే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రల్లో నటించారు.

కల్కి బిజినెస్ ఎంతంటే
ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి రూ. 370 కోట్లు బిజినెస్ జరిగింది.
5వ రోజు తెలుగు కలెక్షన్లు
'కల్కి 2898 ఏడీ' ఐదో రోజూ తెలుగులో భారీ వసూళ్లు సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 6.02 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.17 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 59 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 43 లక్షలు, గుంటూరులో రూ. 55 లక్షలు, కృష్ణాలో రూ. 61 లక్షలు, నెల్లూరులో రూ. 31 లక్షలతో.. రూ. 10.86 కోట్లు షేర్, రూ. 17.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
5 రోజుల్లో తెలుగు కలెక్షన్లు
5 రోజుల్లో 'కల్కి 2898 ఏడీ' తెలుగులో భారీ వసూళ్లు సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 59.19 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.08 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 14.09 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 8.41 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 6.15 కోట్లు, గుంటూరులో రూ. 7.91 కోట్లు, కృష్ణాలో రూ. 7.56 కోట్లు, నెల్లూరులో రూ. 4.00 కోట్లతో.. రూ. 121.39 కోట్లు షేర్, రూ. 188.75 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 5 రోజుల్లో తెలుగులో రూ. 121.39 కోట్లు, తమిళంలో రూ. 11.80 కోట్లు, కర్నాటకలో రూ. 19.55 కోట్లు, కేరళలో రూ. 6.20 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 65.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 73.80 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 298.04 కోట్లు షేర్, రూ. 571 కోట్లు గ్రాస్ వచ్చింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి
'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 370 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 372 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 5 రోజుల్లో దీనికి రూ. 298.04 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 73.96 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











