Kalki 2898 AD 6 Days Collection: కల్కి సంచలనం.. అటు 600 ఇటు 300 కోట్లు ఔట్.. ప్రభాస్ మరో రికార్డు
రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చినా.. తనదైన రీతిలో హవాను చూపిస్తూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు ప్రభాస్. ఇలా సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో తనదైన మార్కును చూపిస్తోన్న అతడు.. వరుసగా భారీ సినిమాలను చేస్తున్నాడు. ఇలా ప్రభాస్ ఇటీవలే 'కల్కి 2898 ఏడీ' అనే సినిమాను చేశాడు. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయింది. దీనికి మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా భారీగా పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'కల్కి 2898 ఏడీ' 6 రోజుల కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి మరి!
కల్కిగా ప్రభాస్ వచ్చాడు
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన టైం ట్రావెల్ మూవీనే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రలు పోషించారు.

కల్కి బిజినెస్ ఎంతంటే
ప్రభాస్ హీరోగా చేసిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి రూ. 370 కోట్లు బిజినెస్ అయింది.

6వ రోజు ఫుల్.. మొత్తంగా
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు ఆరంభం నుంచే అదిరిపోయే స్పందన వస్తోంది. ముఖ్యంగా 6వ రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 8 కోట్లు వరకూ షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలుపుకుని రూ. 20 కోట్లు వరకూ షేర్ వసూలు చేసింది. ఇలా 6 రోజుల్లోనే ఇది రూ. 300 కోట్లు షేర్‌తో సంచలనం సృష్టించింది.


Click it and Unblock the Notifications











