Kalki 2898 AD 6 Weeks Collection: 372 కోట్ల టార్గెట్.. ప్రభాస్ నయా హిస్టరీ.. లాభం చూస్తే మైండ్ బ్లాకే!
టాలీవుడ్‌లో చాలా ఏళ్ల పాటు ప్రభావాన్ని చూపించి.. ఈ మధ్య కాలంలో హాలీవుడ్ రేంజ్ చిత్రాలతో సందడి చేస్తున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. భారీ బడ్జెట్ సినిమాలతో వస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటోన్న అతడు.. ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్తున్నాడు. ఇలా ఇటీవలే 'కల్కి 2898 ఏడీ' అనే సినిమాతో వచ్చాడు. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ మూవీకి ఆరంభం నుంచీ భారీ స్థాయిలో స్పందన లభిస్తూనే ఉంది. ఫలితంగా ఈ సినిమా రికార్డు వసూళ్లతో దుమ్ములేపుతోంది. ఈ నేపథ్యంలో 'కల్కి 2898 ఏడీ' 6 వారాల వసూళ్లపై మీరే ఓ లుక్కేయండి మరి!
కల్కిగా ఎంటరైన ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన క్రేజీ యాక్షన్ మూవీనే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ భారీ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రల్లో నటించారు.

ప్రభాస్ బిజినెస్ ఎంతంటే
ప్రభాస్ హీరోగా చేసిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి రూ. 370 కోట్లు బిజినెస్ అయింది.

6వ రోజు తెలుగు కలెక్షన్లు
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపకల్పనలో ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి నెల రోజులు దాటినా ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం బాగానే లభిస్తోంది. అయితే 42వ రోజు ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రేక్షకుల రెస్పాన్స్ తక్కువగానే వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం బుధవారం రూ. 8 లక్షలు షేర్‌తో పాటు రూ. 15 లక్షలు గ్రాస్ రాబట్టింది.
6 రోజుల్లో తెలుగు కలెక్షన్లు
'కల్కి 2898 ఏడీ' 6 వారాల్లో తెలుగులో భారీ వసూళ్లు రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 92.49 కోట్లు, సీడెడ్‌లో రూ. 21.68 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 21.70 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 12.45 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 9.54 కోట్లు, గుంటూరులో రూ. 11.26 కోట్లు, కృష్ణాలో రూ. 11.25 కోట్లు, నెల్లూరులో రూ. 6.16 కోట్లతో.. రూ. 186.53 కోట్లు షేర్, రూ. 294.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటుతోంది. దీనికి 6 వారాల్లో తెలుగులో రూ. 186.53 కోట్లు, తమిళంలో రూ. 21.86 కోట్లు, కర్నాటకలో రూ. 36.46 కోట్లు, కేరళలో రూ. 12.97 కోట్లు, హిందీలో రూ. 148.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 130.35 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 536.57 కోట్లు షేర్, రూ. 1120 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. లాభమెంత
ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి 'కల్కి 2898 ఏడీ' మూవీ రూ. 370 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 372 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అలాంటిది 6 వారాల్లో దీనికి రూ. 536.57 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 164.57 కోట్లు లాభాలతో రికార్డులు బద్దలు కొట్టేసింది.


Click it and Unblock the Notifications











