Kalki 2898 AD 7 Days Collection: 372 కోట్లు రావాలి.. వారంలోనే రికార్డుల ఊచకోత.. మూవీ హిట్టేనా అంటే!

తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే సినీ రంగాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. అంతలా అతడు చాలా కాలంగా తనదైన చిత్రాలతో సందడి చేస్తూ పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' అనే సినిమాను చేశాడు. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా భారీగా వసూలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'కల్కి 2898 ఏడీ' 7 రోజుల కలెక్షన్లను మీరే చూసేయండి మరి!

కల్కిగా మారిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీనే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ క్రేజీ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు.

Prabhas Starrer Kalki 2898 AD Movie 7 Days Worldwide Box Office Collections

కల్కి బిజినెస్ ఎంతంటే
ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి రూ. 370 కోట్లు బిజినెస్ జరిగింది.

7వ రోజు ఇలా.. మొత్తం
రెబెల్ స్టార్ ప్రభాస్ - క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి ఏడో రోజు కూడా అదిరిపోయే స్పందన లభించింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 5 కోట్లు వరకూ షేర్ వసూలు చేసింది. మిగిలిన అన్ని ఏరియాలూ కలుపుకుని రూ. 15 కోట్లు రాబట్టింది. ఇలా వారంలోనే ఇది రూ. 335 కోట్లు షేర్ వసూలు చేసి సత్తా చాటింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X