Kalki 2898 AD 8 Days Collection: ఆగని ప్రభాస్ సునామీ.. ఇంకో సంచలన రికార్డు ఔట్.. కానీ హిట్ కావాలంటే!
టాలీవుడ్‌లో చాలా ఏళ్ల పాటు స్టార్ హీరోగా హవాను చూపించి.. కొంత కాలంగా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా మూవీలను పట్టాలెక్కిస్తోన్న అతడు.. ఇటీవలే 'కల్కి 2898 ఏడీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఈ నేపథ్యంలో 'కల్కి 2898 ఏడీ' 8 రోజుల కలెక్షన్లను మీరే చూసేయండి మరి!
కల్కిగా ప్రభాస్ దంచుడు
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన టైం ట్రావెల్ మూవీనే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

కల్కి బిజినెస్ ఎంతంటే
ప్రభాస్ హీరోగా చేసిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి రూ. 370 కోట్లు బిజినెస్ అయింది.
8వ రోజు అలా.. మొత్తంగా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు 8వ రోజు కూడా అదిరిపోయే స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 5.50 కోట్లు షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 20 కోట్లు వసూలు చేసింది. ఇలా ఇప్పటి వరకూ రూ. 363 కోట్లు రాబట్టి విజయానికి మరింత చేరువగా వచ్చేసింది.


Click it and Unblock the Notifications











