Kalki 2898 AD 9 Days Collection: వందల కోట్ల టార్గెట్ ఔట్.. ఏడేళ్లలో తొలిసారి.. ప్రభాస్ సంచలన రికార్డు
తెలుగు సినిమా చరిత్రలో అతి తక్కువ మంది హీరోలు మాత్రమే దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించారు. అందులో ఇప్పుడే చాలా మంది పాన్ ఇండియా హీరోలుగా ఎఫెక్టును చూపిస్తున్నారు. అలాంటి వారిలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. అంతలా ఈ బడా హీరో తనదైన చిత్రాలతో హవాను చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'కల్కి 2898 ఏడీ' సినిమాను చేశాడు. దీనికి ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా భారీ స్థాయిలో వసూళ్లు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కల్కి 2898 ఏడీ' 9 రోజుల కలెక్షన్లను మీరే చూసేయండి మరి!
కల్కిగా వచ్చేసిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన క్రేజీ సినిమానే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ భారీ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రలు పోషించారు.

కల్కి బిజినెస్ ఎంతంటే
ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 76 కోట్లతో కలిపి తెలుగులో రూ. 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే, కర్నాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడులో రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి రూ. 370 కోట్లు బిజినెస్ జరిగింది.
9వ రోజు తెలుగు కలెక్షన్లు
'కల్కి 2898 ఏడీ' 9వ రోజూ తెలుగులో వసూళ్లు తగ్గిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 36 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 38 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, గుంటూరులో రూ. 16 లక్షలు, కృష్ణాలో రూ. 17 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో.. రూ. 3.45 కోట్లు షేర్, రూ. 5.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

9 రోజుల్లో తెలుగు కలెక్షన్లు
9 రోజుల్లో 'కల్కి 2898 ఏడీ' తెలుగులో భారీ వసూళ్లు సాధించింది. ఫలితంగా నైజాంలో రూ. 72.91 కోట్లు, సీడెడ్‌లో రూ. 16.68 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 16.76 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 9.93 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7.38 కోట్లు, గుంటూరులో రూ. 9.00 కోట్లు, కృష్ణాలో రూ. 8.90 కోట్లు, నెల్లూరులో రూ. 4.73 కోట్లతో.. రూ. 146.29 కోట్లు షేర్, రూ. 226.90 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 9 రోజుల్లో తెలుగులో రూ. 146.29 కోట్లు, తమిళంలో రూ. 15.15 కోట్లు, కర్నాటకలో రూ. 24.20 కోట్లు, కేరళలో రూ. 8.05 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 88.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 91.90 కోట్లు షేర్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 374.49 కోట్లు షేర్, రూ. 800 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. లాభమెంత
'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 370 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 372 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాంటిది 9 రోజుల్లో దీనికి రూ. 374.49 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.49 కోట్లు లాభాలు వచ్చాయి. ఇక, 'బాహుబలి 2' తర్వాత ప్రభాస్ కొట్టిన తొలి హిట్ ఈ చిత్రమే అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











