Kalki 2898 AD: RRR రికార్డును ఊదేసిన ప్రభాస్.. ఇండియాలోనే ఫస్ట్ మూవీగా కల్కి సెన్సేషన్
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపించడంతో పాటు మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను విపరీతంగా పెంచుకున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఆరంభంలో తెలుగు చిత్రాలకే పరిమితం అయిన అతడు.. బాహుబలి నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగుతోన్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో భారీ సినిమాలను చేశాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' అనే పాన్ వరల్డ్ మూవీని చేశాడు. ఈ చిత్రం తాజాగా RRR రికార్డును బద్దలు కొట్టేసింది. ఆ వివరాలను చూడండి!
కల్కిగా వస్తున్న ప్రభాస్:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రమే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఇచ్చాడు.

ప్రమోషన్స్‌తో సందడి:'కల్కి 2898 ఏడీ' మూవీని పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కించారు. ఈ సినిమాను మే 9వ తేదీనే రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ, అలా వీలు కాకపోండంతో జూన్ 27న తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్‌తో పాటు ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. అలాగే, ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేయడంతో దీని సందడి కనిపిస్తోంది.
అక్కడ బుకింగ్స్ స్టార్ట్:ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందిన 'కల్కి 2898 ఏడీ: సీజ్‌ఫైర్' మూవీ రిలీజ్ జూన్ 27వ తేదీన ఉండడంతో ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వస్తోంది. దీంతో అప్పుడే కలెక్షన్లను కూడా భారీగానే వసూలు చేసింది. అలాగే, ఇండియాలో కూడా టికెట్ల అమ్మకాలు స్టార్ట్ కానున్నాయి.

ఆ మార్కును దాటేసి:రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ: సీజ్‌ఫైర్' మూవీకి సంబంధించి యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. అక్కడ 450 లొకేషన్లలో 1400 షోలకు గానూ అమ్మకాలు ప్రారంభించగా.. ఇప్పటికే 35000లకు పైగా టికెట్లు కూడా అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఇలా ఈ సినిమా అక్కడ అప్పుడే 1 మిలియన్ డాలర్ల మార్కును కూడా చేరుకుంది.

RRR రికార్డు బద్దలు:సాధారణంగా టాలీవుడ్‌లో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రాలకు మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' సినిమాకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం 15 రోజుల ముందే 1 మిలియన్ మార్క్ దాటింది. తద్వారా RRR పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది. అలాగే, ఇండియాలోనే టాప్ మూవీగా ఘనతను అందుకుంది.


Click it and Unblock the Notifications











