Kalki 2898 AD: బుక్ మై షోలో కల్కి ఆల్‌టైం రికార్డు.. దేశంలోనే తొలి హీరోగా ప్రభాస్ చరిత్ర
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈ మధ్య కాలంలో ఎన్నో భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రాలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తద్వారా రికార్డులను బ్రేక్ చేయడంతో పాటు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. అలాంటి వాటిలో రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) సినిమా ఒకటి.
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా క్రియేటివ్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రమే 'కల్కి 2898 ఏడీ'. టైం ట్రావెల్ స్టోరీతో హాలీవుడ్ రేంజ్‌లో రూపొందిన ఈ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని హై లెవెల్‌లో తీశారు. ఈ క్రమంలోనే జూన్ 27వ తేదీన ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల చేశారు.

టెక్నికల్ వండర్‌గా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తూనే ఉంది. ఫలితంగా ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను తెచ్చుకుంటోంది. ఇలా ఇప్పటికే రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్‌ను సైతం వసూలు చేసింది. అదే సమయంలో హిట్ స్టేటస్‌తో పాటు లాభాలను ఖాతాలో వేసుకుంటోంది.
తెలుగు సినిమా స్థాయిని మరో రేంజ్‌కు తీసుకెళ్లేలా వచ్చిన 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి బుక్ మై షో యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఎవరూ ఊహించని రీతిలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం దీని ద్వారా 12.15 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయాయి. తద్వారా వేగంగా 12 మిలియన్ మార్కును చేరుకున్న చిత్రంగా 'కల్కి 2898 ఏడీ' చరిత్రను సృష్టించింది.

హై రేంజ్ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' బుక్ మై షోలో దిమ్మతిరిగే రికార్డును నమోదు చేసుకుంది. అందులో ఎక్కువ టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా ఇది ఘనతను అందుకుంది. తద్వారా షారూక్ ఖాన్ 'జవాన్' మూవీ పేరిట ఉన్న 12.01 రికార్డును ఇది చెరిపేసింది. ఇదే ఊపు కంటిన్యూ అయితే ప్రభాస్ చిత్రం 15 మిలియన్ కూడా కొట్టొచ్చు.
ఇదిలా ఉండగా.. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించింది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్‌ను కంపోజ్ చేశాడు.


Click it and Unblock the Notifications











