Kalki 2898 AD: ప్రభాస్ ఖాతాలో ఎవరూ ఊహించని రికార్డు.. 28తో దేశంలోనే తొలి సినిమాగా సంచలనం
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్‌నే హైలైట్ చేసేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీనికి కారణం తెలుగు చిత్ర పరిశ్రమ రేంజ్ విశ్వవ్యాప్తం అవడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందుకు ఎంతో మంది టాలీవుడ్ హీరోలు సహాయం చేశారు. అందులో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. వరుసగా భారీ చిత్రాలు చేస్తూ దూసుకెళ్తోన్న ఈ బడా హీరో.. ఇటీవలే 'కల్కి 2898 ఏడీ' చిత్రంతో వచ్చాడు. ఇది ఇప్పటికే ఎన్నో రికార్డులు కూడా సాధించింది. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమా మరో సంచలనం సృష్టించింది. ఆ వివరాల్లోకి వెళితే...
కల్కిగా వచ్చేసిన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రమే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ భారీ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలు కీలక పాత్రలను పోషించారు.

అలాంటి టాక్‌తో భారీగా
విజువల్ వండర్‌గా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తూనే ఉంది. ఫలితంగా ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను తెచ్చుకుంటోంది. ఇలా ఇప్పటికే రూ. 1100 కోట్లకు పైగా గ్రాస్‌ను సైతం వసూలు చేసింది. అలాగే, హిట్ స్టేటస్‌తో పాటు లాభాలను కూడా ఖాతాలో వేసుకుంటోంది.
ఏ రోజు ఎంత వచ్చింది
'కల్కి 2898 ఏడీ' మూవీకి ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ. 96.16 కోట్లు షేర్ వచ్చింది. ఆ తర్వాత వరుసగా రూ. 50.20 కోట్లు, రూ. 51.68 కోట్లు, రూ. 67.69 కోట్లు, రూ. 32.31 కోట్లు, రూ. 22.64 కోట్లు, రూ. 23.24 కోట్లు, రూ. 17.49 కోట్లు, రూ. 13.08 కోట్లు, రూ. 25.22 కోట్లు, రూ. 35.91 కోట్లు, రూ. 7.91 కోట్లు, రూ. 6.96 కోట్లు, రూ. 5.92 కోట్లు, రూ. 5.66 కోట్లు, రూ. 5.11 కోట్లు, రూ. 11.27 కోట్లు, రూ. 13.29 కోట్లు, రూ. 4.20 కోట్లు, రూ. 4.78 కోట్లు, రూ. 5.37 కోట్లు, రూ. 1.88 కోట్లు, రూ. 2.07 కోట్లు, రూ. 3.95 కోట్లు, రూ. 5.85 కోట్లు, రూ. 1.35 కోట్లు, రూ. 1.32 కోట్లు, 28వ రోజు రూ. 1.16 కోట్లు వసూలు చేసింది.

పాన్ ఇండియా రికార్డు
ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా గత బుధవారంతో 28 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మొత్తం రోజుల్లో కూడా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల కలెక్షన్లతో కలుపుకుని కోటి రూపాయల కంటే ఎక్కువగానే షేర్‌ను వసూలు చేసింది. తద్వారా ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ సినిమాగా ఇది రికార్డును సాధించింది.


Click it and Unblock the Notifications











