Kalki 2898 AD: ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు.. కల్కి దెబ్బకు మరో సంచలనం నమోదు
రెబెల్ స్టార్ ప్రభాస్.. దేశ వ్యాప్తంగా ఈ పేరు ఒక సంచలనం. అంతలా అతడు సుదీర్ఘ కాలంగా పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతూ దూసుకుపోతోన్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' అనే సినిమాను చేశాడు. పాన్ వరల్డ్ రేంజ్‌లో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ సినిమా మరో క్రేజీ రికార్డును నమోదు చేసుకుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!
కల్కిగా వస్తున్న ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందించిన సినిమానే 'కల్కి 2898 ఏడీ'. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్‌ను కంపోజ్ చేశారు.

రిలీజ్‌కు ఫుల్ సందడి
'కల్కి 2898 ఏడీ' మూవీని చాలా భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను మే 9వ తేదీనే రిలీజ్ చేద్దామని భావించారు. కానీ, అలా వీలు కాకపోండంతో జూన్ 27న తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్‌తో పాటు ట్రైలర్‌ను, పాటను కూడా విడుదల చేసింది. అలాగే, ప్రమోషన్ కార్యక్రమాలను వేగం పెంచడంతో ఈ సినిమా హడావిడి అంతటా కనిపిస్తోంది.
అక్కడ బుకింగ్స్ స్టార్ట్
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో రూపొందుతోన్న 'కల్కి 2898 ఏడీ: సీజ్‌ఫైర్' మూవీ రిలీజ్ జూన్ 27వ తేదీన ఉండడంతో ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ ఈ చిత్రానికి అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వస్తోంది. దీంతో అప్పుడే యూఎస్‌లో ఈ క్రేజీ సినిమా కలెక్షన్లను కూడా భారీగానే వసూలు చేసింది.

మరో మార్క్ దాటేస్తూ
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించి యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్ భారీగా సాగుతున్నాయి. అక్కడ 500లకు పైగా లొకేషన్లలో అమ్మకాలు ప్రారంభించగా.. ఇప్పటికే 40000లకు పైగా టికెట్లు కూడా అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఇలా ఈ సినిమా అక్కడ అప్పుడే 1.5 మిలియన్ డాలర్లను కూడా వసూలు చేసి సత్తా చాటుకుంది.
మళ్లీ నేషనల్ రికార్డు
ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు యూఎస్‌లో అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా వేగంగా 1 మిలియన్ మార్కును చేరుకుంది. ఇప్పుడు కూడా విడుదలకు 13 రోజులు సమయం ఉండగానే 1.5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. తద్వారా వేగంగా ఈ మార్కును చేరుకున్న సినిమాగా ఇది మరో రికార్డును నమోదు చేసుకుంది.


Click it and Unblock the Notifications











