Kalki 2898 AD: చరిత్ర సృష్టించిన ప్రభాస్.. 15 రోజుల ముందే కల్కి సంచలనం
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా స్టామినా భారీగా పెరిగిపోయింది. దానికి కారణం కొందరు హీరోలు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు రెబెల్ స్టార్ ప్రభాస్‌దే. అంతలా అతడు కొంత కాలంగా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. అదే సమయంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' మూవీని చేశాడు. ఈ చిత్రం విడుదలకు రెండు వారాలకు పైగానే సమయం ఉన్నా.. తాజాగా ఇది సంచలన రికార్డును నమోదు చేసింది. ఆ వివరాలను చూడండి!
కల్కిగా మారిన ప్రభాస్
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమానే 'కల్కి 2898 ఏడీ'. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

రిలీజ్‌కు రెడీ అయింది
'కల్కి 2898 ఏడీ' మూవీని హై రేంజ్‌లో తెరకెక్కించారు. ఈ సినిమాను మే 9వ తేదీనే రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ, అలా వీలు కాకపోండంతో జూన్ 27న తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్‌తో పాటు ట్రైలర్‌ను, పాటను కూడా విడుదల చేసింది. అలాగే, ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసేసింది. దీంతో ఈ మూవీ సందడి కనిపిస్తోంది.
బుకింగ్స్ ఎప్పుడో స్టార్ట్
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కలిసి చేసిన 'కల్కి 2898 ఏడీ: సీజ్‌ఫైర్' మూవీ రిలీజ్ జూన్ 27వ తేదీన ఉండడంతో ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వస్తోంది. దీంతో అప్పుడే కలెక్షన్లను కూడా భారీగానే వసూలు చేసింది. అలాగే, ఇండియాలో కూడా ఈ సినిమా టికెట్ల అమ్మకాలు ప్రారంభం అయ్యాయి.

మిలియన్ కొట్టేశాడుగా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ: సీజ్‌ఫైర్' మూవీకి సంబంధించి యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. అక్కడ 450 లొకేషన్లలో 1400 షోలకు గానూ అమ్మకాలు ప్రారంభించగా.. ఇప్పటికే 35000లకు పైగా టికెట్లు కూడా అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఇలా ఈ సినిమా అక్కడ అప్పుడే 1 మిలియన్ డాలర్లను కూడా వసూలు చేసింది.
ఆ మూవీలు వెనక్కే
ప్రభాస్ సినిమాలకు యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్ అదిరిపోయే రీతిలో సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ 'ఆదిపురుష్' మూవీకి ప్రీమియర్స్ ద్వారా 825K డాలర్లు వచ్చాయి. అలాగే, తర్వాత వచ్చిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి కూడా ఒక మిలియన్ మార్క్ దాటేసింది. కానీ, ఇంత వేగంగా మాత్రం ఏ సినిమా కూడా ఈ మైలురాయిని చేరలేదనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











