Kalki 2898 AD: భారత సినీ చరిత్రను తిరగ రాసిన కల్కి.. దేశంలోనే తొలి హీరోగా రికార్డు

తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు హీరోలకు దేశ వ్యాప్తంగా క్రేజ్, మార్కెట్ ఏర్పడ్డాయి. అలాంటి వారిలో అందరి కంటే ముందున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా ఈ మధ్య కాలంలో తనదైన భారీ చిత్రాలతో సందడి చేస్తోన్న అతడు.. రేంజ్‌ను కూడా గణనీయంగా పెంచుకుంటున్నాడు. ఈ ఉత్సాహంతోనే ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సినిమాను చేశాడు. దీనికి అదిరిపోయే స్పందన కూడా లభిస్తోంది. ముఖ్యంగా యూఎస్‌లో ఈ చిత్రం అదిరిపోయే స్పందనతో దూసుకుపోతోంది. దీంతో తాజాగా అక్కడ 'కల్కి 2898 ఏడీ' చరిత్ర సృష్టించింది. ఆ వివరాలు మీరే చూడండి!

క్రేజీ కంటెంట్‌తో కల్కి
ప్రభాస్ నటించిన క్రేజీ కాన్సెప్టు మూవీనే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూర్చాడు.

Prabhas Starrer Kalki 2898 AD Movie Crossed 14 Million Mark In USA

రికార్డు రెస్పాన్స్‌తోనే

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీని పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందించారు. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అనుకున్నట్లుగానే ఈ చిత్రం ఆరంభంలోనే పాజిటివ్ టాక్‌కు రాబట్టింది. ఫలితంగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను అందుకుంటోంది. దీంతో ఈ చిత్రం రూ. 700 కోట్లు వసూళ్లను సాధించి రికార్డులు బ్రేక్ చేసింది.

అక్కడ ఫుల్ రెస్పాన్స్
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించి నార్త్ అమెరికాలో టికెట్ల అమ్మకాలు చాలా రోజుల క్రితమే ప్రారంభం అయ్యాయి. అంచనాలకు తగ్గట్లుగానే అక్కడ ఈ చిత్రానికి దిమ్మతిరిగే రెస్పాన్స్ కూడా వస్తోంది. దీంతో అప్పుడే కలెక్షన్లను కూడా భారీగానే వసూలు చేసింది. ఇలా రిలీజ్ ముందే రికార్డులన్నీ బ్రేక్ చేసి పడేసింది.

Prabhas Starrer Kalki 2898 AD Movie Crossed 14 Million Mark In USA

ఆ మార్కును దాటేసి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించి యూఎస్‌లో టికెట్ సేల్స్ ఊహించని రీతిలో సాగుతున్నాయి. అక్కడ అన్ని ఏరియాల కంటే ఈ చిత్రం ఎక్కువగా రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఫలితంగా వసూళ్లు భారీగా రాబడుతోంది. ఇలా ఈ సినిమా యూఎస్‌లో అప్పుడే 14 మిలియన్ డాలర్ల మార్కును కూడా చేరుకుంది.

Prabhas Starrer Kalki 2898 AD Movie Crossed 14 Million Mark In USA

ఇండియాలోనే ఫస్ట్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు నార్త్ అమెరికాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. తద్వారా ఇది విడుదలైన తొమ్మిది రోజుల్లోనే 14 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. తద్వారా వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న తొలి ఇండియన్ మూవీగా ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సరికొత్త చరిత్రను నమోదు చేసుకుంది.

More from Filmibeat

Read more about: kalki 2898 ad prabhas nag ashwin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X