Kalki 2898 AD: ప్రభాస్ నేషనల్ రికార్డు.. ఇండియాలోనే ఏకైక చిత్రంగా కల్కి ఘనత

పేరుకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తూ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతోన్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఇప్పటి వరకూ ఏ హీరోకూ దక్కని ఎన్నో ఘనతలను అందుకున్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో వరుసగా భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఇలా ఈ మధ్య కాలంలోనే ఎన్నో క్రేజీ సినిమాలు చేశాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' అనే హై రేంజ్ మూవీని చేశాడు. ఈ చిత్రం తాజాగా యూఎస్‌లో సెన్సేషనల్ రికార్డు కొట్టింది. ఆ వివరాలను చూడండి మరి!

కల్కిగా వచ్చిన ప్రభాస్
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సెన్సేషనల్ మూవీనే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

Prabhas Starrer Kalki 2898 AD Movie Crossed 2 Million Mark In USA Premiere Advance Sales

ప్రభాస్ సందడి ఫుల్లు

'కల్కి 2898 ఏడీ' మూవీని హాలీవుడ్ రేంజ్‌లో ఎన్నో భాషల్లో తెరకెక్కించారు. ఈ సినిమాను మే 9వ తేదీనే రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ, అలా వీలు కాకపోండంతో జూన్ 27న తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్‌తో పాటు ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. త్వరలోనే ప్రమోషనల్ ఈవెంట్లను కూడా ఫుల్లుగా నిర్వహించేలా ప్లాన్లు చేస్తున్నారు.

అక్కడే మొదలైందిగా
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కలయికలో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' మూవీ రిలీజ్ జూన్ 27వ తేదీన ఉండడంతో ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వస్తోంది. దీంతో అప్పుడే కలెక్షన్లను కూడా భారీగానే వసూలు చేసింది. అలాగే, ఇండియాలో కూడా టికెట్ల అమ్మకాలు స్టార్ట్ కాబోతున్నాయి.

Prabhas Starrer Kalki 2898 AD Movie Crossed 2 Million Mark In USA Premiere Advance Sales

మైలురాయిని దాటేసి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించి యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్ భారీ స్థాయిలో సాగుతున్నాయి. అక్కడ 500 లొకేషన్లలో 1500 షోలకు గానూ అమ్మకాలు ప్రారంభించగా.. ఇప్పటికే 40000లకు పైగా టికెట్లు కూడా అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఇలా ఈ సినిమా అక్కడ అప్పుడే 2 మిలియన్ డాలర్ల మార్కును కూడా చేరుకుంది.

Prabhas Starrer Kalki 2898 AD Movie Crossed 2 Million Mark In USA Premiere Advance Sales

ఫస్ట్ మూవీగా రికార్డు
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు నార్త్ అమెరికాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. తద్వారా ఇది విడుదలకు 9 రోజులు ముందుగానే 2 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. తద్వారా వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న చిత్రంగా ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సంచలన రికార్డును నమోదు చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X