Kalki 2898 AD: సరికొత్త చరిత్ర సృష్టించిన ప్రభాస్.. ఇండియాలోనే ఫస్ట్ మూవీగా కల్కి రికార్డు
ఇండియా వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో ఎన్నో భారీ చిత్రాలు తెరకెక్కుతోన్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ఆరంభంలోనే అదిరిపోయే క్రేజ్‌ను సొంతం చేసుకుని సంచలనం అవుతున్నాయి. అలాంటి వాటిలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' ఒకటి.
పాన్ వరల్డ్ రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'కల్కి 2898 ఏడీ' సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ వివరాలను మీరే చూడండి!

పాన్ వరల్డ్ రేంజ్‌లోనే
ప్రభాస్ నటించిన పాన్ వరల్డ్ రేంజ్ మూవీనే 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు.

ఎక్కడ చూసినా అదే
'కల్కి 2898 ఏడీ' మూవీని ఎన్నో భాషల్లో తెరకెక్కించారు. ఈ సినిమాను మే 9వ తేదీనే రిలీజ్ చేద్దామని మొదట అనుకున్నారు. కానీ, అలా వీలు కాకపోండంతో జూన్ 27న తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్‌తో పాటు ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. ఫలితంగా కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా ఇదే సినిమా హడావిడి కనిపిస్తోంది.

ఆ వెబ్‌సైట్లన్నీ క్రాష్
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా రిలీజ్‌కు సమయం దగ్గర పడడంతో అన్ని ఏరియాల్లోనూ టికెట్ల అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది. అందుకే టికెట్లను బుక్ చేసుకునే వెబ్‌సైట్లు అన్నీ క్రాష్ అయిపోతున్నాయి. ఎలా అయితేనేం ఈ సినిమా టికెట్లు భారీగా బుక్ అయిపోతున్నాయి.

అక్కడ ముందే స్టార్ట్
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'కల్కి 2898 ఏడీ' మూవీ రిలీజ్ జూన్ 27వ తేదీన ఉండడంతో ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ముందే ఓపెన్ అయ్యాయి. అక్కడ ఈ చిత్రానికి దిమ్మతిరిగే రెస్పాన్స్ కూడా వస్తోంది. దీంతో అప్పుడే కలెక్షన్లను కూడా భారీగానే వసూలు చేసింది. ఇలా ఇప్పటికే రూ. 30 కోట్లు వరకూ గ్రాస్ వసూళ్లు కూడా వచ్చాయి.

మరో మార్క్ దాటేసి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించి యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్ ఊహించని రీతిలో సాగుతున్నాయి. అక్కడ 500 లొకేషన్లలో 3000 షోలకు గానూ ఇప్పటికే 1.5 లక్షలకు పైగా టికెట్లు కూడా అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఇలా ఈ సినిమా యూఎస్‌లో అప్పుడే 4 మిలియన్ డాలర్ల మార్కును కూడా చేరుకుని సత్తా చాటింది.

ఇండియాలోనే ఫస్ట్
నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు నార్త్ అమెరికాలో బీభత్సమైన స్పందన లభిస్తోంది. తద్వారా ఇది విడుదలకు రెండు రోజుల ముందే 4 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. తద్వారా వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న తొలి ఇండియన్ మూవీగా ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సంచలన రికార్డును సాధించింది.


Click it and Unblock the Notifications











